తూర్పుగోదావరి

ఎమ్మెల్యే గోరంట్ల లేకుండా సైన్స్ కేంద్రం శంకుస్థాపనా..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18: రాజమహేంద్రవరం బొమ్మూరులో నిర్మించనున్న ఉప ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేకుండానే జరిగిపోవడం వివాదాస్పద పరిస్థితులు సృష్టిస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానికంగా లేని సమయంలోనే ఆదరాబాదరా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో భేదాభిప్రాయాలు పొడచూపే విధంగా మారింది. ఎంపీ మాగంటి మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి స్థానికంగా వున్న నేతలెవరూ పెద్దగా హాజరు కాలేదు. ముఖ్య నేతలంతా ముఖం చాటేశారు. గోరంట్లకు ఈ కార్యక్రమం గురించి అప్పటికపుడు ఏదో లాంఛనంగా ఆహ్వాన పత్రం ఇంటికి పంపించినట్టు తెలిసింది. కనీసం ఫోన్‌లో కూడా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయకపోవడం గోరంట్ల ఒకింత నొచ్చుకున్నారని తెలిసింది. దీంతో స్థానికంగా వున్న నేతలు ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. వాస్తవానికి ఈ శంకుస్థాపన సమయంలోనే బొమ్మూరు తెలుగు మహిళా ప్రాంగణంలో సిద్ధం చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాల్సి వుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల లేకపోవడం వల్ల ఆ ఆవిష్కరణ కూడా వాయిదా పడింది. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల లేకుండా, గోరంట్లకు తెలియకుండా అసలు ఈ సైన్స్ కేంద్రం శంకుస్థాపన ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఎంపీ మాగంటి మురళీమోహన్, గోరంట్ల మధ్య ఈ శంకుస్థాపన కార్యక్రమం విభేదాలు పెంచేదిగా మారిందని తెలుస్తోంది. మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఈ విషయాన్ని గ్రహించినట్టు తెలిసింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికా నుంచి వచ్చిన తర్వాతే శంకుస్థాపన పెట్టుకుంటే బావుండేదని, ఈలోగానే ఏం తొందర వచ్చిందని పార్టీ శ్రేణులు రుసరుసలాడారు. గోరంట్ల హాజరుకాకపోవడంతో కార్యక్రమం వెలితిగా సాగింది. కోలాహలంగా జరిగాల్సిన ఈ కార్యక్రమం వెలవెలబోయింది. వాస్తవానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప కూడా హాజరు కావాల్సి వుంది. చివరి నిమిషంలో వారి పర్యటనలు రద్దయ్యాయి.