తూర్పుగోదావరి

ఎలైన్‌మెంటుపై అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 23: కోటిపల్లి- నర్సాపురం రైల్వే పనులకు సంబంధించి కొత్త ఎలైన్‌మెంట్ ద్వారా ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి ఏవిధమైన నష్టం వాటిల్లదని, దీనిపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం అమలాపురంలోని మాజీ మంత్రి స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు స్వగృహంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత ఎలైన్‌మెంటును 2003 సంవత్సరంలో రూపొందించారని, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల కొత్త ఎలైన్‌మెంట్ చేయాల్సి వస్తుందని ఎంపి స్పష్టం చేసారు. జాతీయ రహదారికి ఎక్కడో ఒక చోట క్రాసింగ్ వచ్చే అవకాశం ఉందని అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారన్నారు. రైల్వేలైను లెవిల్ క్రాసింగ్‌లు ఎక్కడా రాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపి తెలిపారు. ముక్తేశ్వరం నుండి పేరూరు వరకూ ఉండే మార్గంలో అక్కడక్కడా గృహాలకు నష్టం వాటిల్లుతుందని ఆయా ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారని, భయపడేంత స్ధాయిలో నష్టం జరగదని చెప్పారు. ఎక్కడన్నా గృహాలను నష్టం వాటిల్లినట్లు నిర్ధారణ అయితే ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చించి మార్కెట్ రేటుకన్నా అధికంగా నష్టపరిహారం రైల్వేశాఖ ద్వారా ఇప్పిస్తామని, ఈప్రతిపాదనకు రైల్వేశాఖ అంగీకరించిందని ఎంపీ పండుల తెలిపారు. కోనసీమ వాసులు ఎన్నో ఎళ్లుగా కంటున్న కలలకు వాస్తవరూపం వచ్చే అవకాశం అతి తొందరలోనే ఉందని కొత్తగా వేసే ఎలైన్‌మెంట్‌ను అడ్డుకొని కోనసీమ వాసుల కలలను నీరుగార్చవద్దని ఈ సందర్భంగా ఎంపీ విజ్ఞప్తి చేసారు. కోనసీమ ప్రాంతంలో ఓఎన్‌జిసి ద్వారానష్టం వాటిల్లిన దేవర్లంక గ్రామవాసులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించిందన్నారు. అలాగే జిఎస్‌పిసి ద్వారా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా ఆ సంస్థ అంగీకరించినట్లు ఇప్పటికే 50 మందిని విధుల్లోకి తీసుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ సమావేశంలో అమలాపురం మాజీ ఏఎంసీ చైర్మన్ అల్లాడి సోంబాబు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, బిజెడ్‌ఎడిఆర్ యుసిసి సభ్యుడు రుద్రరాజు సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.