తూర్పుగోదావరి

ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 23: ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ, బీజేపీ మోసం చేస్తున్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు విమర్శించారు. హోదా అంశాన్ని వదిలి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాడు సీపీయం మినహా అన్ని పార్టీల ఆమోదంతోనే రాష్ట్ర విభజనను యుపిఎ ప్రభుత్వం చేసిందన్నారు. 2014లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంగతిని గుర్తు చేశారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిమిత్తం కోటి సంతకాల సేకరణ, పోస్టల్ బ్యాలెట్, వివిధ రకాల ధర్నాలను చేసిందన్నారు. నాడు హోదా కోసం ఈ కార్యక్రమాలు చేస్తుంటే సిఎం చంద్రబాబు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులను ఉద్యమాల్లో పాల్గొనవద్దంటూ బహిరంగంగా చెప్పేవారన్నారు. నాడు హోదా కంటే ప్యాకేజీ మెరుగని ఇప్పుడు హోదాయే నయమంటూ కొత్తరాగాన్ని అందుకున్నారన్నారు. ఉద్యమాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబులో ఇంత మార్పునకు కారణమేంటని ప్రశ్నించారు. హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీ రాజకీయ సమస్యగా మార్చాయన్నారు. హోదా కోసం మార్చి 6, 7, 8తేదీల్లో చలో పార్లమెంట్ నిర్వహించి ఢిల్లీలో ధర్నా చేస్తామని దీనికి వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని గిడుగు కోరారు. వచ్చేది తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ తామే అమలు చేస్తామని గిడుగు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, పీఎం మోదీ పరస్పరం విమర్శించుకోకుండా కిందిస్థాయి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఈనెల 27న అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఒక్కడి వల్ల అవిశ్వాసం వీలవదని మిగిలిన పెద్ద పార్టీలను ఆయన కలసి మద్దతు కోరాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు అద్దంకి ముక్తేశ్వరరావు, అకుల వెంకటరమణ, బన్నూ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

విభజన హామీల కోసం పార్లమెంటులో అవిశ్వాసం
*గిడుగు రుద్రరాజు
అయినవిల్లి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీ,ప్రత్యేక హోదాలకోసం పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉందని దీనికి జాతీయపార్టీలు మద్దతు ఇవ్వనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. శుక్రవారం అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, అప్పటి ప్రధానమంత్రి మన్మోహాన్‌సింగ్ హామీలు, చట్టంలోని అంశాలన్నీ అమలు కోసం ఈనెల 27న అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆత్మగౌరవ దీక్షను చేపట్టనున్నట్లు రుద్రరాజు తెలిపారు. దీక్షలో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, జెడీ శీలం పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ విధానం ఒకటేనని, ఆంధ్రుల ఆకాంక్షల కోసం కాంగ్రెస్‌పార్టీ మాత్రమే ఉద్యమాలు చేస్తుందన్నారు. జంగా గౌతమ్ మాట్లాడుతూ ప్యాకేజీకి, హోదాకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో అంకం వీర్రాజు, సలాది బుచ్చిరాజు, కుసుమే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.