తూర్పుగోదావరి

యోగా ద్వారా జీవన వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23: యోగా ద్వారా జీవన విధానం మెరుగు పడుతుందని, విద్యార్థులు యోగా చేయడం వల్ల విద్యలో ఏకాగ్రత వుంటుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయంలో విద్యపై యోగ ప్రభావం-అంశాలు-సవాళ్ళు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ముత్యాలనాయుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య జి భువనేశ్వరలక్ష్మి, ఆచార్య వి సుధాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. యోగాపై పరిశోధకులు సమర్పించిన పత్రాల సంకలనం యోగా ప్రభావం అనే పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. సదస్సులో వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా, విద్యా రెండూ సమాన ప్రాతినిధ్యం కలిగిన అంశాలన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక రుగ్మతలు దూరమవుతాయని, కాబట్టి ప్రపంచ దేశాలు యోగా విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారన్నారు. కేవలం అమెరికాలోనే 357 యోగా కేంద్రాలు వున్నాయంటే దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఎంత గొప్పవో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ద్వారా యోగా కోర్సులు ప్రారంభించామని, ప్రస్తుతం దేశ, విదేశాల్లో యోగాకు ఉన్న డిమాండ్‌ను బట్టి దీనికి మరింత ప్రాధాన్యం ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆచార్యులు వి సుధాకర్, భువనేశ్వరలక్ష్మి మాట్లాడుతూ యోగా ద్వారా లభిస్తుందని, తద్వారా అన్ని పనులు సమగ్రంగా చేయగలమని చెప్పారు. ముఖ్యంగా విద్యార్ధులు యోగాపై పట్టు సాధించడం ద్వారా సరైన జీవన శైలి అలవాటవుతుందని, అలాగే అనేక ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. యోగాను ఆధ్యాత్మిక ప్రక్రియగా మాత్రమే చూడవద్దని, అది మానవాళికి అవసరమయ్యే జీవన ప్రక్రియగా చూడాలని తెలిపారు. సదస్సు ఛైర్మన్ డాక్టర్ కె సుబ్బారావు, కన్వీనర్ వి రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు హాజరై సుమారు 90 పరిశోధనా పత్రాలు సమర్పించారని తెలిపారు. ఆచార్య ఎస్ టేకి, డాక్టర్ పి విజయ నిర్మల, రాపర్తి రామ యోగా కేంద్రం శర్మ, కో కన్వీనర్లు ఆర్ సుబ్బారావు, డాక్టర్ ఎం గోపాలకృష్ణ, డాక్టర్ జి ఏలీషాబాబు, జె రాజమణి, డాక్టర్ ఆర్వీ వరహాల దొర, రాజేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు.