తూర్పుగోదావరి

మహానటిని పరిశ్రమ కోల్పోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, ఫిబ్రవరి 25: చిత్ర పరిశ్రమ శ్రీదేవి లాంటి ఒక మహానటిని కోల్పోయిందని ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ అన్నారు. శ్రీదేవితో సినిమా తీసే అవకాశం తనకు రాలేదని, అయినా ఆమె గురించి తెలుసన్నారు. నాటి మహా నటీమణులలో శ్రీదేవి ఒకరిగా నిలుస్తారని పేర్కొంటూ ఆమె మృతికి సంతాపం తెలిపారు.
మంచి కధకోసం ప్రయత్నిస్తున్నా!
ప్రస్తుతం మంచి కథకోసం ప్రయత్నిస్తున్నానని, కథ దొరికితే దానిని ఎవరితో తీయాలో ఆలోచిస్తానని డైరెక్టర్ వినాయక్ అన్నారు. కొత్తపేటలో బొరుసు భాస్కర్ ఇంట వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంటిలిజెంట్ సినిమా పోవడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని అందుకోసమే మంచి కథ కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. మహేష్‌బాబుతో సినిమా కూడా ప్రస్తుతం లేదన్నారు. సినిమా జీవితం తనకు సంతోషకరంగానే ఉందన్నారు. మంచి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చానని, దానిని కొంత వరకు సాధించాననే సంతృప్తి తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి శ్రీనివాస్, బండారు వెంకటేశ్వరరావు విళ్ళ మారుతీప్రసాద్, ముద్రగడ దుర్గాప్రసాద్, రాయి దుర్గాప్రసాద్, గండ్రోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు సాంకేతికతతో ముందడుగు వేయాలి
రాజవొమ్మంగి, ఫిబ్రవరి 25: విద్యార్థులు నేడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు నుండి టెలీ కాన్ఫరెన్సు ద్వారా ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీఎం విద్యార్థులతో మాట్లాడారు. చిన్న తరగతుల నుండి టెక్నాలజీ ద్వారా ఇచ్చే పాఠ్యాంశాలను విద్యార్థులు అర్థం చేసుకొంటూ ముందుకు వెళ్లాలన్నారు. మన రాష్ట్రాన్ని చూసి దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. అందుకు విద్యార్థులంతా నేటినుండే సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతీ పల్లె సాంకేతికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం సులభంగా అభివృద్ధి బాటలో నడుస్తుందని సీఎం ఆకాంక్షించారు. తహసీల్దార్ జె శ్రీనివాసు, పాఠశాల ఉపాధ్యాయులు బొడారపు కృష్ణ, స్థానిక ఏపీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తప్పిన పెనుముప్పు
మలికిపురం, ఫిబ్రవరి 25: శనివారం రాత్రి గొల్లపాలెంలో హెచ్‌టి విద్యుత్ లైను తెగిపడి భయానక వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో ఏ విధమైన ట్రాఫిక్ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. శిథిల స్థితిలో ఉన్న హెట్‌టి లైను రోడ్డుమీద పడి భయంకర శబ్దంతో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో యువకులు సబ్ స్టేషన్‌కు ఫోన్‌చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించడంతో ముప్పు తప్పింది. హెచ్‌టి విద్యుత్ తీగ రోడ్డుపై పడి తారురోడ్డు బీటలు వారింది.

నరసన్న ఉత్సవాలకు అంకురార్పణ
కోరుకొండ, ఫిబ్రవరి 25: కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. కోరుకొండ కొండపై మొదటిగా పాల్గుణ శుద్ధ దశమి నాడు స్వామివారి సాక్షాత్కరించడంతో ఉత్సవాలకు దశమినాడు అంకురార్పణ చేస్తారు. ఆదివారం సాయంత్రం ఆలయ అర్చకులు విష్వక్సేనుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా కోనేరు వద్దకు వెళ్లి అక్కడ పుట్టమన్ను సేకరించి దానిని ఆలయం వద్దకు తీసుకువచ్చి అంకురార్పణ చేసారు. అనంతరం ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఆదివారం రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల సందర్బంగా కోరుకొండకు కళ్యాణ శోభ సంతరించుకుంది. కొండపైన, దిగువ భాగాన భారీ ఎత్తున విద్యుత్ అలంకరణ చేసారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రంగరాజభట్టార్, అన్నవరం సూపరింటెండెంటు రమణ, కోరుకొండ ఇన్‌చార్జి తాటిపాక రాంజీ తదితరులు పాల్గొన్నారు.