తూర్పుగోదావరి

దివికేగిన ‘్భలోక సుందరి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 25: వెండి తెర ఇలవేల్పు, అభిమానుల కలల రాజకుమారి, అతిలోక సుందరి, ఇండియన్ సూపర్ స్టార్, ప్రఖ్యాత నటీమణి శ్రీదేవి అకాల మృతి ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేసింది. మరల రాని లోకాలకు తరలిపోయిన అభినేత్రిని తలచుకుని అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. దశాబ్దాల పాటు చలనచిత్ర రంగాన్ని ఏలిన శ్రీదేవి అంటే తెలియనివారుండరు! అలనాటి మేటి కథానాయకుల నుండి నిన్నటి తరం హీరోల వరకు అందరి సరసనా నాయకిగా నటించిన మహానటి నేడు జీవించి లేరని తెలిసి అభిమానులు ఖిన్నులయ్యారు. సాధారణంగా సినీ హీరోలకు అభిమానులుంటారు. అభిమాన సంఘాలుంటాయి. అయితే ఆ హీరోలందరి సరసనా నటించిన అగ్ర కథానాయిక అంటే అందరు హీరోలకు చెందిన అభిమానులూ ఇష్టపడతారు. ఒకపుడు అగ్ర కథానాయకులకు దీటుగా శ్రీదేవికి జిల్లాలో అభిమాన సంఘాలుండేవి! అటువంటి గొప్ప హీరోయిన్‌గా శ్రీదేవి పేరొందారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, అమితాబ్ బచ్చన్, అనిల్‌కపూర్, రిషీకపూర్, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు ప్రముఖ కథానాయకుల సరసన నటించారు. ప్రాంతాలకు, భాషలకతీతంగా వెండితెరపై వెలిగిపోయారు. తెలుగు చలన చిత్రరంగాన్ని ఎదురులేని రీతిలో ఏలిన శ్రీదేవి అనంతర కాలంలో బాలీవుడ్‌కు వెళ్ళారు. అయినప్పటికీ జిల్లాతో శ్రీదేవికి విడదీయలేని అనుబంధం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అనేక చిత్రాలకు సంబంధించి షూటింగ్స్‌లో ఆమె పాల్గొన్నారు. పదహారేళ్ళ వయసు సినిమా చిత్రీకరణలో భాగంగా కడియంలోని అందమైన నర్సరీల్లో జరిగిన చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. కడియపులంక పూదోటల్లో ‘సిరిమల్లె పూవా.. సిరిమల్లె పూవా..’ అంటూ పరవశించారు. నటభూషణ్ శోభన్‌బాబు కథానాయకుడిగా నటించిన దేవత చిత్రంలో ‘వెల్లువొచ్చె గోదారమ్మ’ అంటూ హొయలొలికించారు. హీరో కృష్ణ కథానాయకుడిగా నిర్మితమైన వజ్రాయుధంలోను, కృష్ణంరాజు హీరోగా నటించిన త్రిశూలం సినిమా చిత్రీకరణ సందర్భంగాను జిల్లాలో శ్రీదేవి పర్యటించారు. అనేక హిందీ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఇక్కడ హిమ్మత్‌వాలా, తోఫా వంటి చిత్రాల షూటింగ్‌ల్లో శ్రీదేవి పాల్గొన్నారు. సామర్లకోటలోని చింతామణి గణపతిశాస్ర్తీ స్వగృహానికి శ్రీదేవి వచ్చిన సందర్భాలున్నాయి. ఏదేమైనా చిత్రసీమలోకి ప్రవేశించి ఏభై ఏళ్ళవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవంలో పాల్గొనాల్సిన శ్రీదేవి అర్ధంతరంగా దివికేగడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

నన్నయ విద్యార్థులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల విద్యార్థులతో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై సీఎం విద్యార్థులతో ముచ్చటించారు. తొలి ప్రయోగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని విద్యావ్యవస్థ వివరాలను అలెక్సా వాయిస్ విధానం ద్వారా విన్పించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ అత్యధికంగా విద్యార్థులు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా చూశామన్నారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. సాంకేతిక రంగంలో భారతదేశాన్ని అభివృద్ధి దిశగా నడపడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, అందుకే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని వీసీ చెప్పారు.

రూ. 130 కోట్లతో రహదారులు నిర్మాణం
రావులపాలెం, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నా గత నాలుగేళ్ళ కాలంలో కొత్తపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 130 కోట్లతో రోడ్ల నిర్మాణం చేసిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం రావులపాలెం గ్రామ పరిధిలోని వెదిరేశ్వరం రోడ్డు, కొమరాజులంక పరిధిలోని బండిరేవు పుంత రోడ్లను రూ. 1.5 కోట్లతో సీసీ రోడ్లుగా ఆధునికీకరించే పనులకు ఆయన శంకుస్థాపన చేసి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డిని సమన్వయపరుచుకొని నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నానన్నారు. అంతకు ముందు శంకుస్థాపన శిలా ఫలకంపై డీసీఎంఎస్ ఛైర్మన్ కెవి పేరు వేయకపోవడంపై ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రెండు రోజుల్లో శిలాఫలకంపై కెవి పేరు కూడా వేయాలని సుబ్రహ్మణ్యం సూచించడంతో వివాదం సమసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు యార్లగడ్డ సునీత, కుడుపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షులు గుత్తుల పట్ట్భారామారావు, ఏఎంసీ ఛైర్మన్ వేగేశ్న చంద్రరాజు, పెచ్చెట్టి చిన్నారావు, ఆత్మ కమిటీ చైర్మన్ జక్కంపూడి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు,