తూర్పుగోదావరి

‘నంది’కి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 13: నంది నాటకోత్సవానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నంది నాటకోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. నంది నాటకోత్సవాలకు కళల రాజధానిగా భాసిల్లుతున్న రాజమహేంద్రవరం మరోసారి వేదికైంది. శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో 14 నుంచి 22వ తేదీవరకు నంది నాటకోత్సవాల్లో భాగంగా పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటికలు ప్రదర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు-2017 బుధవారం తెర లేస్తోంది. 2017వ సంవత్సరానికి నంది నాటక పోటీల ప్రాథమిక పరిశీలనలు తెనాలిలో నిర్వహించారు. కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలులోనూ నిర్వహిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 2వ తేదీన తెనాలిలో మొదలైన ఈ పోటీ ప్రదర్శనలు ప్రస్తుతం కాకినాడ, రాజమహేంద్రవరంలలో జరుగుతున్నాయి. మొత్తం 75 నాటక సమాజాల నుంచి ప్రదర్శలు వచ్చాయి. వేలాది మంది కళాకారులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం ఈ పోటీ ప్రదర్శనలకు వేదికైంది.
ప్రజలకోసం నాటకం-నాటకం కోసం సమాజం అన్న సరికొత్త నినాదంతో దరఖాస్తు చేసుకున్న అన్ని నాటకాలను ప్రజలు కూడా తిలకించేలా ప్రజల మధ్యే ప్రదర్శించే అవకాశం కల్పించడంతో పాటు ప్రతి నాటక సమాజానికి ప్రదర్శనా పారితోషికం రూపంలో మొత్తం రూ. 80 లక్షల వరకు అందిస్తున్నారు. వివిధ సమాజాల నుంచి వచ్చిన ప్రదర్శనలకు ప్రదర్శనా పారితోషికంగా పద్య నాటకానికి రూ.30 వేలు, సాంఘిక నాటకానికి రూ. 20 వేలు, సాంఘిక నాటికకు రూ. 15 వేలు, బాలల నాటికకు రూ.15 వేలు, కళాశాల, విశ్వవిద్యాలయం నాటికకు రూ.15 వేలు ఇవ్వనున్నారు. తుది పోటీలకు ఎంపికైన నాటకాల వీడియోలను న్యాయ నిర్ణేతలు క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలను, వ్యక్తిగత బహుమతుల విజేతలను ఎంపిక చేస్తారు. ఈ బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందజేస్తారు. నంది నాటకోత్సవాలకు మొత్తం 360 దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల తెలుగు నాటక సమాజాల నుంచి కూడా దరఖాస్తులు రావడం విశేషంగా నిలిచింది. మొత్తం మీద నంది నాటకోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున కళాకారులు, రచయితలు, దర్శకలు, నాటక రంగ నిపుణులు రాజమహేంద్రవరానికి తరలి రానున్నారు. ఆనం కళా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

తారాస్థాయికి నేతల విమర్శలు
పిఠాపురం, మార్చి 13: బీజేపీ, టీడీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆదివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నేతలపై వర్మ విసిరిన సవాల్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయయ్య ప్రతి సవాల్ విసిరారు. మంగళవారం బీజేపీ కార్యదర్శి అల్లుబోయిన సూరిబాబు నివాసంలో ఆయన నిర్వహించిన విలేకర్ల సమావేశంలో టీడీపీ నేతల ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందన్న ఎమ్మెల్యే వర్మ విసిరిన సవాల్‌పై చర్చకు తాము సిద్ధమేనని, కేంద్రం ఎన్ని కోట్లు నిధులిచ్చిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. వార్డు మెంబరుగా కూడ గెలవలేని మంత్రి నారా లోకేష్‌ని పంపిస్తారో, మీరే వస్తారో తేల్చుకుని వేదిక సిద్ధం చేసుకోవాలంటూ ఎమ్మెల్యే వర్మనుద్దేశించి అన్నారు. పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ జెండాలు తగలబెట్టిన ఎమ్మెల్యే వర్మకి పార్టీపై ప్రేమ పెరిగిపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. సోము వీర్రాజు జిల్లాకు ఏం చేసారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే, కేంద్రం ఇచ్చిన నిధులతో కాకుండా మీరేమైనా అభివృద్ధి చేయించారా అ ప్రశ్నించారు. బీజేపీ నేతలను విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదన్నారు. బీజేపీ క్రమ శిక్షణ గల పార్టీ అని, సిద్ధాంతపరంగా నియమ నిబంధనలు ఉంటాయన్నారు. పార్టీ టిక్కెట్ ఇవ్వలేద, రాజ్యసభ సీటు ఇవ్వలేదనో విమర్శించడం, తరువాత పార్టీకి కట్టుబడి ఉన్నామంటూ బీరాలు పలకడం టీడీపీ నేతలకు అలవాటేనన్నారు. బీజేపీ ఏం చేసిందో లెక్కలతో సహా సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల కోసం తప్పుడు ప్రకటనలతో నెపాన్ని ఎవరిపై మోపాలో చూసుకుంటూ విమర్శలు చేయడం ఆయనకు అలవాటేనన్నారు. ఉపాధి నిధులు అడ్డుకుంటున్నారనడంలో ఎంత మాత్రం వాస్తవం లేదని, ఉపాధి నిధులను దారుణంగా పక్కదారి పట్టించి పేదలను పీల్చుకు తిన్న గొప్పదనం టీడీపీ నేతలకే దక్కిందన్నారు.
పోలవరం యుసీలు ఇవలేదు
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు (యుసీలు) ఇవ్వమని అడిగితే చంద్రబాబుకు కోపం వస్తుందని, ఇది చాలా విడ్డూరమని మాలకొండయ్య ముఖ్యమంత్రి తీరుపై ఎద్దేవా చేశారు. పోలవరం టెండర్ల విషయంలో డొంక తిరుగుడు మాటల వల్లే చంద్రబాబు దొరికిపోయారని, వాస్తవాలు వెలుగుచూస్తే చాలా మంది జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంటుందన్నారు. పోలవరం అభివృద్ధి విషయంలో తెలంగాణాకు చెందిన ఏడు మండలాలు ఏపీలో విలీనం చేయడంతోనే బీజేపీ చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ పోలవరాన్ని పూర్తిచేయిస్తుందని, ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకుంటారన్నారు. సమావేశంలో బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ చింతపల్లి పద్మారెడ్డి, బుర్రి మురళీధరరావు, ఈగల కొండబాబు, దాట్ల సూర్యనారాయణరాజు, దోనే అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.