తూర్పుగోదావరి

30 నుండి హోంగార్డ్సు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మార్చి 13: జిల్లాలో హోంగార్డ్సు స్వచ్ఛంద సంస్థలో హోంగార్డ్సు విధులకు నిర్వహించేందుకు ఖాళీగా ఉన్న 62 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీనుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకటి నుండి వెయ్యి వరకు నంబర్లు ఉన్న అభ్యర్థులకు ఈ నెల 30న, 1001 నుండి 2000 వరకు గల అభ్యర్థులకు 31న, 2001 నుండి 3 వేలు వరకు ఉన్న అభ్యర్థులకు ఏప్రిల్ 1వ తేదీన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా 3001 నుండి 4 వేలు వరకు గల అభ్యర్థులకు 2న, 4001 నుండి 5 వేలు వరకు 3న, 5001 నుండి 6 వేలు వరకు 4న, 6001 నుండి 7 వేలు వరకు 5న, 7001 నుండి 8 వేలు వరకు గల రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్న అభ్యర్థులకు ఏప్రిల్ 6వ తేదీన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మిగిలిన కేటగిరీలోని అభ్యర్థులు (కంప్యూటర్ ఆపరేర్లు, డ్రైవర్లు, వంటవారు, చాకలి, మంగలివారు, పారిశుద్ధ్య కార్మికులు)కు సంబంధించిన పరీక్షల వివరాలను త్వరలో తెలిజేయనున్నట్టు పేర్కొన్నారు. జనరల్ హోంగార్డ్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎత్తు 165 సెంటీమీటర్లు, ఎస్టీ అభ్యర్థులు 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని వివరించారు. అభ్యర్థులు ప్రకటించిన తేదీలలో తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, హాల్‌టికెట్స్ తీసుకుని జిల్లా ఎస్పీ కార్యాలయానికి హాజరుకావలసి ఉంటుందని ఎస్పీ విశాల్ గున్నీ తెలియజేశారు.

కందరెడ్డికి రైతురత్న అవార్డు
కడియం, మార్చి 13: కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన రైతు సత్తి భాస్కరరెడ్డి (కంద రెడ్డి) మంగళవారం హైదరాబాద్‌లో రైతురత్న అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో మంగళవారం ఆరాధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డి చేతుల మీదుగా భాస్కరరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శేషశయనారెడ్డి మాట్లాడుతూ దేశానికి రైతే వెనె్నముక అని, అటువంటి రైతులను సత్కరించడం కనీస ధర్మమని పేర్కొన్నారు. రైతు భాస్కరరెడ్డి గతంలో కూడ పలు అవార్డులు అందుకున్నారు. ఆయన వ్యవసాయం ద్వారా వచ్చే లాభాలతో కడియం మండలంలోని దుళ్ల, వీరవరం, మురమండ గ్రామాల్లో పార్కులు నిర్మించడం, స్వచ్ఛ్భారత్‌కు ట్రాక్టర్లను బహూకరించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఆయన సేవలను గుర్తించిన ఆరాధన సంస్థ ఈ అవార్డును బహూకరించింది. భాస్కరరెడ్డికి అవార్డు లభించడం పట్ల మురమండ, దుళ్ల, వీరవరం సర్పంచులు ఈదర పాపారావు, గుర్రపు సత్యనారాయణ, పడమటి భాగ్యవతి హర్షం వ్యక్తం చేశారు.