తూర్పుగోదావరి

మరోసారి ప్రజాసాధికార సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 13: ప్రజాసాధికార సర్వేలో ఇంతవరకు నమోదు కాని వారికి మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్టు జేసీ ఎ మల్లికార్జున చెప్పారు. ఈమేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 2016 సంవత్సరంలో ఇంటింటి సర్వే ద్వారా ప్రజాసాధికార సర్వే ప్రారంభించామన్నారు. ట్యాబ్స్ సహాయంతో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించినట్టు చెప్పారు. సదరు సర్వే సమయంలో కొందరు ఇంటి వద్ద లేకపోవడం, గ్రామాల్లో వలసలు, ఇతర కారణాల వలన వారి వివరాలను ప్రజాసాధికార సర్వేలో నమోదు కాలేదన్నారు. దీనివలన వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో ఆటంకాలేర్పడినట్టు చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రజాసాధికార సర్వేలో నమోదు కాని వారిని, సర్వేలో కేవైసీ కింద నమోదు చేసే నిమిత్తం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో పురపాలక సిబ్బంది ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి ప్రజాసాధికార సర్వే ప్రారంభించినట్టు తెలిపారు. వారం రోజుల పాటు ఈ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇంతవరకు ప్రజాసాధికార సర్వేలో నమోదు కాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమోదు కాని పక్షంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఆటంకాలు ఏర్పడుతాయని చెప్పారు. తక్షణం సాధికార సర్వేలో నమోదకు అర్హులు ముందుకు రావాలని జేసీ మల్లికార్జున పిలుపునిచ్చారు.