తూర్పుగోదావరి

నర్శిపూడిలో దారి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, మార్చి 13: ఆలమూరు మండలం నర్శిపూడి-దుళ్ల ఆర్‌అండ్‌బి రోడ్డుపై సోమవారం రాత్రి 11 గంటలకు గుర్తుతెలియని దుండగులు ఓ గుమాస్తా నుండి సుమారు రూ. 4.57 లక్షలు దోచుకుపోయారు. దీనికి సంబంధించి మండపేట సీఐ లక్ష్మణరెడ్డి, ఆలమూరు ఎస్సై పి దొరరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలమూరు మండలం గుమ్మిలేరులో గల శ్రీ సత్యకృష్ణ మోడరన్ రైసుమిల్లులో గత పదిహేనేళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాసు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, పోలవరం, దేవరపల్లి తదితర గ్రామాల్లో బియ్యం బాకీలు నిమిత్తం రూ.4.57 లక్షలు, 50 వేలు విలువ చేసే రెండు చెక్కులు వసూలు చేశాడు. ఈ సొమ్ముతో జాతీయ రహదారిపై నుండి వచ్చి చొప్పెల్ల గ్రామం మీదుగా గుమ్మిలేరు మోటారు సైకిల్‌పై వెళుతుండగా దానాలమ్మ గుడి సమీపం వద్దకు వచ్చేసరికి వెనుకనే మోటారు సైకిల్‌పై హెల్మెట్ ధరించి వస్తున్న ఇద్దరు వ్యక్తులు శ్రీనివాసుపై ఇనుప రాడ్‌తో దాడిచేసి గాయపరిచారు. అతని వద్ద గల బ్యాగ్‌తో ఉన్న మొత్తం నగదును దోచుకుపోయారు. గాయాలైన శ్రీనివాసు ప్రాణభయంతో పరుగులు తీశాడు. సంఘటనా స్థలానికి రామచంద్రపురం డీఎస్పీ కెవి సంతోష్‌కుమార్, మండపేట రూరల్ సీఐ లక్ష్మణరెడ్డి హుటాహుటిన చేరుకుని బాధితుని వద్ద వివరాలు సేకరించారు. అలాగే సమీప ప్రదేశాన్ని పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గాయాలైన శ్రీనివాసుని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై ఎస్సై దొరరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఈ కేసును కడియం పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా సంఘటన జరిగిన పరిధి ఆలమూరు మండలంలోనిది కావడంతో ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రొయ్యల చెరువులను అడ్డుకున్న రైతుకూలీలు
రామచంద్రపురం, మార్చి 13: ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఆక్వా రంగానికి పెద్ద పీట వేయడం పట్ల రైతుకూలీలు, ప్రజాపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం మండలం నరసాపురపు పేట గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న రొయ్యల చెరువులను అఖిలభారత రైతుకూలీ సంఘం, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. సుమారు 40 ఎకరాలను రొయ్యల చెరువులుగా మార్చేందుకు పొక్లెయినర్లతో తవ్వుతుంటే అడ్డుకుని పొక్లెయినరును నరసాపురపుపేట-రామచంద్రపురం ప్రధాన రహదారి వద్దకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐకెయంఎస్ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు, జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, గుబ్బల ఆదినారాయణ, పీడియస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండ్రు గనిరాజు, గ్రామ పెద్దలు వింజుమళ్ల శ్రీనివాసు, ఈలి తాతయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పైడిమళ్ల ఆనంద మాదిగ, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు జక్కల అప్పారావు, గెద్దాడ సూరిబాబు, వీధి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

చేపల చెరువులో విష ప్రయోగం
చెరువుపై తేలిన రొయ్యలు
రామచంద్రపురం, మార్చి 13: కె గంగవరం మండల ప్రధాన కేంద్రమైన గంగవరం గ్రామంలో ఉన్న చేపల చెరువుల్లో గుర్తుతెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు కలపడంతో చెరువులో రొయ్యలు చనిపోయి తేలాయి. చెరువులు సేద్యం చేసే రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చనిపోయిన రొయ్యలను పరీక్షలకు పంపుతామని, కారణం తెలుసుకున్న తరువాత నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. కాగా ఇప్పటివరకు గ్రామంలో నీటి కాలుష్యానికి రొయ్యల చెరువులే కారణాలని గ్రామస్థులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన చేపడుతున్న సమయంలో మత్స్యశాఖాధికారులు అవన్నీ చేపల చెరువులే, రొయ్యల చెరువులు కాదని వాదించిన నేపథ్యంలో చెరువులో రొయ్యలు చనిపోవడం ప్రశ్నార్థకంగా మారింది.