తూర్పుగోదావరి

సంక్షేమ వసతి గృహంలో ఎసిబి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, మార్చి 14: రౌతులపూడి మండలం ములగపూడి బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఎం సుధాకర్ నేతృతంలో నిర్వహించిన తనిఖీల్లో వార్డెన్ నిర్వాకం బయటపడింది. వసతి గృహంలో 140మంది విద్యార్థులున్నట్టు హాజరు పట్టీలో చూపగా బృందం కేవలం 32మందిని చూసి అవాక్కయ్యారు. ఈ హాజరు ఎప్పటి నుండి జరగుతుందన్న దిశగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. వార్డెను 140 మందిని హాజరుగా చూపి మెనూ ఖర్చులు అదే విధంగా ఉండడం బృందం తనిఖీల్లో వెల్లడైంది. కాగా రౌతులపూడి మండల పరిధిలో వసతి గృహాలుకు తుని సబ్ ట్రెజరీ నుండి నగదు బదిలీ అవుతుంది. దీంతో ఏసీబీ అధికారులు సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి ములగపూడి వసతిగృహం ఆర్థిక చెల్లింపులపై ఆరా తీసారు. ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ చాలకాలంగా ములగపూడిలో హాస్టలులో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంలో తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. తనిఖీల్లో సీఐ పుల్లారావు, ఎస్సై నరేష్, బి శ్రీనివాస్, గణేష్‌బాబు, ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
శాసనసభలో ఎమ్మెల్యే పులపర్తి
పి గన్నవరం, మార్చి 14: వైశ్య, కమ్మ, క్షత్రియ, రెడ్డి వర్గాల పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి శాసనసభలో జీరో అవర్‌లో ప్రస్తావించినట్టు బుధవారం ఫోన్ ద్వారా తెలిపారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని కూలంకషంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం వద్ద ఉచిత ఇసుక ర్యాంపు నిర్వహణకు వాహనాల రాకపోకలకు రహదారి బాట నిర్మించడానికి సుమారు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, దీని నిమిత్తం అధికారులు అంచనాలు రూపొందిచారని సభకు దృష్టికి తీసుకెళ్ళగా దానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. భూగర్భ, గనులు శాఖ మంత్రి సుజయ కృష్ణరంగారావు బదులిస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు నిర్వహించుకుంటే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పులపర్తి తెలిపారు.

పేలిన సెల్ ఫోన్: యువకుడికి గాయాలు
ఐ పోలవరం, మార్చి 14: కొత్తగా సెల్‌ఫోన్ కొనుగోలు చేసుకున్న ఒక యువకుడు దానిని ప్యాంటు జేబులో పెట్టుకుని బయటకు వెళుతుండగా అది పేలిపోవడంతో గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కొమరగిరిలో బుధవారం జరిగింది. కొమరగిరి గ్రామానికి చెందిన వరసాల నరేష్ ఇటీవల మురమళ్ళలో ఈ నెల 1న ఒక సెల్ షాపు నుండి సెల్‌కాన్ కంపెనీకి చెందిన సి 327 మోడల్ సెల్ ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే సెల్ ఫోన్ పేలిపోవడంతొ తీవ్ర భయాందోళనకు గురై గాయాలతో వైద్యం నిమిత్తం డాక్టర్లను ఆశ్రయించాడు. అయితే తన ఫోన్ నష్టపోయిన విషయాన్ని సెల్ ఫోన్ అమ్మిన షాపు యజమానికి తెలియజేశామని, జరిగిన నష్టాన్ని ఇప్పించకపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తామని బాధితుడు నరేష్ తెలిపారు.