తూర్పుగోదావరి

రైసుమిల్లులో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, మార్చి 14: గొల్లప్రోలు శివారులో ఒక రైసుమిల్లులో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 2కోట్ల రూపాయలకు పైగా ఆస్తినష్టం జరిగింది. బి ప్రత్తిపాడు రోడ్డులోని వెలుగుల అయ్యారావుకు చెందిన స్వామి అయ్యప్ప ట్రేడర్సులో ఉదయం 9.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రైసు సార్టెక్స్ మిషనరీ యూనిట్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అలాగే పేనల్ బోర్డు, యుపిఎస్, కంప్రెషర్, ఎలివేటర్స్, మోటార్లు, రైస్ పేకింగ్ మిషన్ దగ్ధమయ్యాయి. వీటితో పాటు 18 లారీల బియ్యం, నూకలు, ప్లాస్టిక్ సంచులు బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు 2కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ చిక్కాల రత్నబాబు, పిఠాపురం ఫైర్ ఆఫీసర్ డి రాంబాబు మిల్లును సందర్శించి జరిగిన నష్టంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నబాబు మాట్లాడుతూ ప్రమాదం జరగడానికి గల కారణాలు, ఎంత మేర ఆస్తినష్టం సంభవించిందన్న అంశంపై విచారిస్తున్నామని, పూర్తి వివరాలు సేకరించిన అనంతరం నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని పిఠాపురం ఏరియా రైసు మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఊటా జాన్‌బాబు, మాజీ అధ్యక్షుడు పేకేటి నాగేశ్వరరావు, పిఠాపురం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మొగలి బాబ్జీ తదితరులు సందర్శించి మిల్లు యజమాని వెలుగుల అయ్యారావు, మహేంద్రను పరామర్శించారు.