తూర్పుగోదావరి

రాజమహేంద్రిలో రమ్యంగా ‘నంది’ ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 14: నంది 2017 నాటకోత్సవాలు తొలి నాటకం, నాటిక, ప్రదర్శన, నవల ఆవిష్కృతమైన చారిత్రక గడ్డ రాజమహేంద్రవరంలో ఆరంభమయ్యాయి. స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో బుధవారం నంది నాటకోత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రమ్యంగా ప్రారంభమయ్యాయి. నంది నాటకోత్సవాల ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ, రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ హాజరయ్యారు. నంది నాటకోత్సవాలు 2017 ప్రదర్శనలను ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ నాటక రంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. చలనచిత్ర రంగ అభివృద్ధికి కీలకమైన నాటక రంగాన్ని సీఎం అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మరుగున పడిన నాటకరంగానికి ముఖ్యమంత్రి ఊపిరులూదారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రజా ప్రోత్సాహం తోడవ్వాలన్నారు. ప్రాచీన కాలం నుంచి సామాజిక చైతన్యానికి నాంది పలికింది నాటకరంగమని, టెక్నాలజీ పెరిగిన తరుణంలో ఈ రంగాన్ని మరింతగా ఆదుకోవాల్సి వుందన్నారు. నాటక రంగాన్ని కాపాడుకోవాలన్నారు. నాటక రంగానికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నివ్వాలన్నారు.
రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించడం ప్రాశస్థ్యాన్ని పునరంకితం చేసినట్టయిందన్నారు. ఇదే వేదికపై ఉగాది ఉత్సవాలు నిర్వహించేలా ఎఫ్‌డిసి ఛైర్మన్ కృషి చేయాలని కోరారు. మన సంస్కృతిని భావితరాలకు అందించేందుకు నంది నాటకోత్సవాలను విద్యార్థులు తిలకించేలా చూడాలన్నారు. టీడీపీ నాయకుడు ఆళ్ళ గోవింద్ మాట్లాడుతూ కళలను ప్రోత్సహించడమంటే మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమేనన్నారు. సినిమాలకు మాతృక నాటకరంగమని, ప్రతీ ఆదివారం హేపీ సండే నిర్వహిస్తున్నారని, అదే క్రమంలో ఆనం కళాకేంద్రంలో ప్రతీ ఆదివారం నాటకాలు ప్రదర్శించేలా అధికారులు కృషిచేయాలని కోరారు. ప్రముఖ గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా మాట్లాడుతూ నాటక రంగం పుట్టిన రాజమహేంద్రవరంలో ఆనం కళాకేంద్రం కళాకారులు అద్దెకు తీసుకోవాలంటే చాలా ఆర్థిక భారంగా వుందని, ఈ అద్దెను కనీసం రూ.10 వేలకు తగ్గించేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని కోరారు. నాటకరంగ న్యాయ నిర్ణేత జానకీనాధ్ ప్రారంభ సభకు స్వాగతం పలికారు. స్థానిక కార్పొరేటర్ మజ్జి రాంబాబు తదితరులు మాట్లాడారు. సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ప్రజల్లోనే నంది నాటకోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
మరో ముఖ్య అతిథి గుడా ఛైర్మన్, నాటక రచయిత గన్ని కృష్ణ మాట్లాడుతూ తొలి నాటక రచన, తొలి నాటిక, తొలి ప్రదర్శన, తొలి తెలుగు నవల పుట్టిన రాజమహేంద్రవరంలో నంది నిర్వహించడం చాలా సందర్భోచితమన్నారు. నిరుపేద కళాకారులు తమకు ప్రదర్శనలు ఇప్పించాలని ప్రాధేయపడ్డం చాలా బాధాకరంగా వుందని, వారికి ప్రదర్శనలు ఇప్పించి ప్రోత్సహించాలన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో 1996 నుంచి చంద్రబాబునాయుడు నంది నాటకోత్సవాలను ఆరంభించారన్నారు. మరుగున పడుతున్న కళారూపాలను కాపాడేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ శేషసాయి మాట్లాడుతూ ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు తెనాలిలో నంది నాటకోత్సవాలు జరిగాయన్నారు. రాజమహేంద్రవరంలో ప్రతీ రోజు ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నంది నాటకోత్సవాలు జరుగుతాయన్నారు. నాటకోత్సవాల ప్రారంభానికి ముందు నాట్యాచారిణి నాగరాణి శిష్య బృందం ప్రదర్శనా కౌశల్యం విశేషంగా ఆకట్టుకుంది.