తూర్పుగోదావరి

శివారు భూములకు నీటి ఎద్దడి ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 20: జిల్లాలోని శివారు ప్రాంతాల భూములకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. సంయుక్త బృందాల పర్యవేక్షణ ద్వారా నీటి ఎద్దడి ఎదురుకాకుండా చూస్తామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో మంగళవారం వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రబీ సీజన్ నేపథ్యంలో నీటి సమస్యపై సంబంధిత శాఖాధికారులతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ వచ్చే 10 నుండి 15 రోజుల్లో శివారు ప్రాంతాలకు నీటి పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ రబీ సీజన్లో నీటి ఎద్దడికి తావులేకుండా గోదావరిలోకి జలాలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డొంకరాయి మినీ విద్యుత్ ప్లాంట్‌ను 10 రోజుల పాటు మూసివేయడం ద్వారా 2 వేల క్యూసెక్కుల అదనపు నీరు వచ్చే వీలుందన్నారు. ఈమేరకు ప్రభుత్వంతో చర్చించిన పిమ్మట చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమైనట్టు చెప్పారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని వివరించారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఉద్యానవన శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డీవార్మింగ్ మాత్రల పంపిణీ, కృత్రిమ గర్భోత్పత్తి, పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. వేసవి నేపథ్యంలో పశువుల తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక శాఖలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులందరూ కష్టించి పనిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 జే రాధాకృష్ణమూర్తి, ట్రైనీ కలెక్టర్ ఎ ఆనంద్, ఇరిగేషన్ ఎస్ ఈ కృష్ణారావు, పశు సంవర్ధక శాఖ జేడీ శివాజీ, మత్స్యశాఖ జేడీ జయరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రామ్మోహన్‌రావు, ఉద్యాన వన శాఖ ఏడీ గోపీకుమార్ తదితరులు పాల్గొన్నారు.