తూర్పుగోదావరి

ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 20: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోని గోడౌన్లలో ఉన్న ఈవీఎంలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివిధ పార్టీలకు చెందిన నాయకుల సమక్షంలో మంగళవారం పరిశీలించారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న గోడౌన్‌ను మంగళవారం సీళ్లు తొలగించి తెరిచి చూశారు. జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల కోసం వినియోగించే 13 వేల 369 బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను 10 రోజుల పాటు పరిశీలించే ఏర్పాట్లను కలెక్టరేట్ అధికారులు చేశారు. ఈ తనిఖీల్లో రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు యెనిమిరెడ్డి మాలకొండయ్య, వరిపల్లి స్వామి, జి సాయిబాబు, నక్కా కిషోర్, కెఎస్ శ్రీనివాస్, పలివెల వీరబాబు, రఫీఖాన్, ట్రైనీ కలెక్టర్ ఓ ఆనంద్, డిఆర్‌ఓ ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, ఆర్‌డిఓ ఎల్ రఘుబాబు, అర్బన్ తహశీల్దార్ జి బాలసుబ్రహ్మణ్యం, విఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పథకం లక్ష్యాలను సమర్పించాలి
కాకినాడ, మార్చి 20: ఉపాధి హామీ పథకం కింద 2018-19 సంవత్సరంలో వివిధ శాఖల ద్వారా చేపట్టే వార్షిక లక్ష్యాల నిర్దేశం కొరకు ప్రతిపాదనలు శనివారానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉపాధి హామీ కన్వర్జెన్సీ శాఖల అధికారులతో నేరుగా, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మస్తర్లను ఈ నెల 31వ తేదీలోగా చెల్లింపుల పెండింగ్‌లు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో మంజూరు చేసిన పంట కుంటలు, వర్మీకంపోస్ట్ యూనిట్లు, క్రీడా మైదానాల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి పనులకు సంబంధించి చెల్లింపులను కూలీల ఖాతాలకే జమ చేయాలన్నారు. వచ్చే సంవత్సరం నుండి సాధ్యమైనంత వరకు ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ సమావేశంలో జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, డిఎఫ్‌ఓ నందిని సలారియా, అసిస్టెంట్ కలెక్టర్ ఓ ఆనంద్, డ్వామా పిడి జి రాజకుమారి, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, జడ్పీ సీఈవో ఆర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.