తూర్పుగోదావరి

యండగండి దత్తుడు చేరికతో టీడీపీలో ఆనందోత్సాహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, మార్చి 20: కె గంగవరం మండలం యండగండి దత్తుడు చోడే గోవిందరాజులు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరడంతో మండల పరిధిలోని యువత ఆనందోత్సాహాలతో మునిగి తేలుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే గోవిందరాజులు కారణాల రీత్యా ప్రత్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్ శిబిరంలో చేరారు. ఆయన విజయం పట్ల, ఆయన పోటీచేసే సమయంలో ఆయనకు మద్దతు పలికే విషయంలో పిల్లి సుభాష్‌చంద్రబోసుకు వెన్నుదన్నుగా నిలబడిన గోవిందరాజులు గత కొన్ని రోజులుగా వైసీపీకి దూరంగా ఉంటూ పార్టీకి రామ్‌రామ్ చెప్పారు. అయితే ఆయన అడుగులు ఏ పార్టీ వైపు వెళ్తాయోనని నియోజకవర్గ యువత ఎదురుచూస్తున్న నేపధ్యంలో చిట్ట చివరకు పాత కేంద్రమైన తెలుగుదేశం పార్టీకి ఆయన చేరారు. కె గంగవరం మండలంలో దత్తుడు చేరికతో 27 గ్రామాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొద్దిమేర నీరసం వ్యక్తం చేసినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా గత ఎన్నికల్లో టీడీపీకి లభించిన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లను ఈ ఎన్నికల్లో కైవసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తన్నారు. యండగండి గ్రామంలో తనకున్న పట్టు, నియోజకవర్గంలో గల బంధువర్గం మద్దతు కూడగట్టి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులును గెలిపించి తీరుతానని దత్తుడు చేసిన ప్రకటనను తెలుగుదేశం శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి.