తూర్పుగోదావరి

ఓవర్ బ్రిడ్జిపై టాటా ఏస్ వాహనం దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మార్చి 21: రైల్వే ఓవర్ బ్రిడ్జిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం స్థానిక కల్పన సెంటర్ నుండి పోర్టుకు వెళ్లే వైఎస్సార్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టాటా ఏస్ వాహనంలో సుమారు 30 డబ్బాల్లో కిరోసిన్ తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. దీంతో ఆ సమయంలో అక్కడ ఉన్న బాటసారులు, ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నికి ఆహుతి అవుతున్న టాటా ఏస్ వాహనంపై నీటిని వెదజల్లి మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ ప్రమాదం జరిగిన తక్షణం ఘటనా ప్రాంతం నుండి పరారయినట్టు తెలిసింది. కిరోసిన్ ఎక్కడ నుండి తరలిస్తున్నారు, ప్రమాదానికి గల కారణాలపై త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నెలాఖరుకు కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం ఇవ్వాలి
జెసి మల్లికార్జున
కాకినాడ, మార్చి 21: ఖరీప్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ నిమిత్తం తీసుకున్న మిల్లర్లు ఈ నెల 31వ తేదీలోగా మిల్లింగ్ చేసి బియ్యాన్ని డెలివరీ చేయాలని జేసీ ఎ మల్లికార్జున మిల్లర్లను ఆదేశించారు. బుధవారం జేసీ తన ఛాంబర్‌లో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల నుండి 9 లక్షల 73 వేల 897 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి సుమారు 365 మంది రైసు మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఇవ్వాలని కోరామన్నారు. ఇంతవరకు 6 లక్షల 30 వేల 640 టన్నుల కస్టమ్ బియ్యాన్ని డెలివరీ చేశారని, ఇది రాష్ట్రంలోనే అత్యధిక శాతం డెలివరీ అయిన జిల్లాగా 96 శాతం మిల్లుల వద్ద నుండి బియ్యం సేకరించినట్టు చెప్పారు. అధికారులు తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని డెలివరీ అయ్యేలా చూడాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎ కృష్ణారావు, డిఎస్‌ఓ పి ప్రసాదరావు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి, ఎఎస్‌ఓ పి సురేష్, పి బాలకృష్ణ, పురుషోత్తం, పి ఉదయభాస్కర్, డిటిలు పాల్గొన్నారు.