తూర్పుగోదావరి

మొండి బకాయిల కోసం మాజీ ఎంపీ గొడౌన్ ముందు మున్సిపల్ అధికారుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మార్చి 21: మున్సిపాలిటీకి చెల్లించాల్సిన షాపులు, ఇల్లు, కుళాయి పన్నులు వంటి మొండి బకాయిల వసూళ్లకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర మున్సిపల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో బకాయిదారులను గుర్తించిన అధికారులు వారి ఇళ్లు, షాపు, గొడౌన్‌ల ఎదుట నిరసన దీక్షలు చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పెద్ద మొత్తంలో బకాయిలున్న వారిపై ముందుగా అధికారులు దృష్టి సారించారు. అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తికి చెందిన నల్లవంతెన సమీపంలో గల గొడౌన్‌కు సంబంధించి రూ.7.50 లక్షలు బకాయి ఉంది. ఆ బకాయి వసూలుకు అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్‌వివిఎస్ బాపిరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి అమరనాధ్, సిబ్బందితో గొడౌన్ వద్దకు చేరుకుని గొడౌన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి స్వయంగా గొడౌన్‌కు చేరుకుని అధికారులకు వివరణ ఇచ్చారు. బకాయికి సంబంధించి తక్షణమే లక్షా 50 వేల రూపాయల చెక్కును కుసుమ అధికారులకు ఇచ్చారు. రెండు రోజుల్లో మరో రెండు లక్షల నగదు చెల్లించేందుకు గొడౌన్‌ను అద్దెకు తీసుకున్న వారు మాజీ ఎంపీ కుసుమ సమక్షంలో హామీ ఇచ్చారు. మిగిలిన బకాయిని త్వరలోనే చెల్లిస్తామని మాజీ ఎంపీ హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ మొండి బకాయిదారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే చెల్లించాలని, లేకపోతే వారి ఇళ్ల ముందు, షాపుల ఎదుట నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే తాళాలు వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.