తూర్పుగోదావరి

తగ్గుతున్న తెల్లదోమ ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, మార్చి 23: కడియం నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న తెల్లదోమ భారి నుంచి నర్సరీలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఈ వైరస్ తగ్గుముఖం పడుతున్నట్టు నర్సరీ రైతులు తెలిపారు. గత ఆరు నెలలుగా తెల్లదోమ కారణంగా కొబ్బరి మొక్కల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. కొబ్బరి మొక్కల తయారీకి పెట్టింది పేరుగా నిలిచిన ఈ ప్రాంతం తెల్లదొమ దాడితో ఒక్కసారిగా కుదేలైంది. కోట్ల సంఖ్యలో మొక్కలు విక్రయాలు జరగకుండా నిలిచిపోయాయి. దీంతో నర్సరీ రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కొబ్బరితోపాటు కొబ్బరిని పోలిన ఆర్నమెంటల్ రకాలైన అరేకాఫాం, రాయల్‌ఫాం, ఫాక్స్‌టైల్‌ఫాం వంటి రకాలపై కూడా ఈ తెల్లదోమ ప్రభావం పడింది. ఓ వైపు జీఎస్టీ ప్రభావంతో దేశ వ్యాప్తంగా మొక్కల అమ్మకాలు, కొనుగోళ్లు సన్నగిల్లగా, మరోవైపు తెల్లదోమ ఉధృతి గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. ఈ నేపథ్యంలో నర్సరీ రైతులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెల్లదోమను నివారించేందుకు ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎండల ప్రభావానికి ఈ దోమ ఉధృతి తగ్గింది. దీంతో నర్సరీ రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

అడవుల్లో అగ్ని ప్రమాదాలు నివారించాలి
రాజవొమ్మంగి, మార్చి 23: వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరక్కుండా అటవీ శాఖ సిబ్బంది కృషి చేయాలని జిల్లా అటవీ అధికారి నందనీ సలారియా అన్నారు. మండలంలో రాజవొమ్మంగి, లాగరాయి, వాతంగి అటవీ ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించారు. పశువుల కాపరులు, గిరిజనులు అడవుల్లోకి వెళ్లిన సమయంలో అడవులకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని కల్పించవద్దని సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అడవుల్లో అగ్నిప్రమాదం జరగడంతో చిన్న మొక్కలు సైతం కాలి బూడిదై రాబోవుకాలంలో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. రూ. 17 లక్షల వ్యయంతో అడవుల్లో తవ్విన కందకాలను డిఎఫ్‌వొ పరిశీలించారు. పర్వతాల కింద కందకాలు తవ్వడం వలన అడవిలో కురిసిన వర్షం వృధాగా బయలకు పోకుండా అడవిలోనే ఇంకిపోయేందుకు ఉపయోగ పడతాయన్నారు. టేకు ప్లాంటేషన్ నుండి చెట్లు స్మగ్లర్ల బారిన పడకుండా సిబ్బంది గట్టిగా కృషి చేయాలని డిఎఫ్‌వొ ఆదేశించారు. రేంజి అధికారి టి నాగేశ్వరరావు, ఎఫ్‌ఎస్‌వొ సత్యనారాయణ, సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.