తూర్పుగోదావరి

విద్యాభివృద్ధికి ప్రవాసాంధ్రుల సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రవాసాంధ్రులు సహకారం అందిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవాసాంధ్రుల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను జయరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 5వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూముల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 2600 పాఠశాలల్లో ఈ క్లాసులను ఏర్పాటు చేశామన్నారు. 2018 నాటికి అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ క్లాస్‌రూములను ఏర్పాటు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో సుమారు 4లక్షల మంది ప్రవాసాంధ్రులున్నారని వీరందరూ మాతృ దేశానికి సేవ చేయటానికి తమ వంతు కర్తవ్యంగా అవసరమైన సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. విద్యాభివృద్ధితో పాటుగా అంగన్‌వాడీలు, బరియల్ గ్రౌండ్స్‌లను కూడా అభివృద్ధికి సహకరిస్తారని జయరాం చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఇందులో భాగంగా డిజిటల్ క్లాసులు ఏర్పాటుకు చర్యలు చేపడుతుందన్నారు. డిఇఓ ఎస్ అబ్రహం మాట్లాడుతూ జిల్లాలో 303 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేశామని ఒక్కొక్కటికి 1.45 లక్షల వ్యయమవుతుండగా 70 శాతం ప్రభుత్వం, 30 శాతం దాతల నుండి సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ క్లాసురూములను పనితీరుపై జిల్లా కలెక్టర్ ప్రతీ మంగళవారం సమీక్షిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ సుంకర పావని, పిల్లి సత్యనారాయణమూర్తి, గ్రామసర్పంచ్ బొండాడ విజయ, సమాచార శాఖ డిడి ఎం ఫ్రాన్సిస్, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ వైడి రామారావు, డివైఇఓ ఎల్ గణేష్‌బాబు, పాలడుగు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.