తూర్పుగోదావరి

గిరిజన విథ్య, వైద్యానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, మార్చి 23: గిరిజన విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిశాంత్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన గంగవరంలో ఆకస్మికంగా పర్యటించారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సందర్శించి విలేకర్లతో మాట్లాడారు. ఏజన్సీలో గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు అభివృద్ధికి మరింత కృషిచేస్తామన్నారు. విద్యా నైపుణ్యాలు మెరుగునకు, విద్యా ప్రగతికి కృషిచేస్తామన్నారు. వేసవి తరగతులు నిర్వహించే యోచనలో ఉన్నామని, విద్యాశాఖాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తొలుత స్థానిక పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో ఓపీని పెంచాలని, ఎక్కువ శాతం ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యుడుని ఆదేశించారు. పీహెచ్‌సీలో వార్డులను, ల్యాబ్, మందుల స్టాక్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. పాముకాటుకు మందు ఉందా లేదాని ప్రశ్నించారు. పీహెచ్‌సీ ఓపీ, సిబ్బంది వివరాలను వైద్యుడు భవానీ శంకర్ పీఓకి వివరించారు. అనంతరం పీఓ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో బాలికల హాజరు వివరాలు, విద్యా ప్రగతిని ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాన్ని సందర్శించి వంటశాలను, మినరల్‌వాటర్ ప్లాంట్‌ను, స్టాక్‌రూమ్‌ను పరిశీలించి సరుకులు తనిఖీ చేశారు. వంటకు వాడుతున్న ఆయిల్ గురించి ఆయన ఆరా తీశారు. పాఠశాల విద్యా ప్రగతి, వసతి గృహం సమస్యలను హెచ్‌ఎం నర్సాయమ్మ, వార్డెన్ సీతారత్నం పీఓకి వివరించారు.

ద్రాక్షారామలో ఉన్నతాధికారుల పర్యటన
రామచంద్రపురం, మార్చి 23: రామచంద్రపురం నియోజకవర్గ అతిపెద్ద గ్రామమైన ద్రాక్షారామని నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు శుక్రవారం ద్రాక్షారామకు చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పురపాలక, గ్రామ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పిఎన్‌ఎస్ సాయిబాబు, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ గోవిందరావు, రాజమహేంద్రవరం కేంద్రంగా కలిగిన డివిజనల్ పివో వరప్రసాద్‌తోపాటు స్థానిక ఎంపీడీవో పివివి సత్యనారాయణమూర్తి, ఈవోపీఆర్‌ఆర్డీ మండ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1956లో ద్రాక్షారామ పురపాలక సంఘంగా ఏర్పడిన తరువాత తిరిగి 1964లో పురపాలక పరిధిలోని గ్రామాలను పంచాయతీలుగా విభజించి పురపాలక సంఘాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆనాటి నుండి ద్రాక్షారామతోపాటు తోటపేట, అన్నాయపేట, వెలంపాలెం, జగన్నాయకులపాలెం తదితర గ్రామాలు విడివిడిగా పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏయే గ్రామ పంచాయతీలను ద్రాక్షారామ నగర పంచాయతీలో చేర్చాలన్న అంశంపై ద్రాక్షారామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు మ్యాప్ ద్వారా పరిశీలించారు. అనంతరం తోటపేట, అన్నాయపేట, వెలంపాలెం, వేగాయమ్మపేట గ్రామాలను పరిశీలించారు. ఎటువంటి విరామం లేకుండా ఆవాస కేంద్రాలు ద్రాక్షారామకు చేరువగా ఉన్నాయన్న అంశంపై పరిశీలన జరిపారు.