తూర్పుగోదావరి

ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మార్చి 23: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ కోర్సులకు సంబంధించి నన్నయ సెట్ 2018 సద్వినియోగం చేసుకోవాలని ఆ యూనివర్శిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ కె దీప్తి కోరారు. అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రవేశ పరీక్షల వివరాలను ఆమె వెల్లడించారు. ఈ నెల 13న నన్నయ సెట్‌ను వీసీ ముత్యాలునాయుడు విడుదల చేశారన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నన్నయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల సమాచారాన్ని మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడ సమావేశం నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు. నన్నయ విశ్వవిద్యాలయంతోపాటు ఉభయ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలలు, కాకినాడ, తాడేపల్లిగూడెంలలో గల పీజీ సెంటర్లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు విధిగా 2018 నన్నయ సెట్ రాయాల్సి ఉందన్నారు. కళాశాల పరిధిలో ఆర్ట్స్‌కు సంబంధించి 14, సైన్సుకు సంబంధించి 17 పీజీ కోర్సులకు నన్నయ సెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఏప్రిల్ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.500లు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.300లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. రూ.1000ల అపరాధ రుసుముతో ఏప్రిల్ 23వ తేదీ వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని, మే 1 నుండి హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 7 నుండి శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రంపచోడవరం, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడ కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినట్లు దీప్తి తెలిపారు. విశ్వ విద్యాలయం పరిధిలో ఆర్ట్సు కోర్సుల్లో 2670 సీట్లు, సైన్సు కోర్సుల్లో 3535 సీట్లు ఉన్నాయని, వాటిని నన్నయ సెట్ ద్వారానే భర్తీచేస్తారన్నారు. అనంతరం నన్నయ సెట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌కేబీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వి కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపాల్ పెచ్చెట్టి కృష్ణకిశోర్, నన్నయ ఇంజినీరింగ్ కశాళాల అధ్యాపకులు పెర్సీ పాల్గొన్నారు.