తూర్పుగోదావరి

ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డతీగల, ఏప్రిల్ 17: ప్రత్యేకహోదా సాధన కోసం మండల టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని గొంటువానిపాలెం నుండి అడ్డతీగల మీదుగా రాయపల్లి వరకు టీడీపీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ అన్యాయంగా విభజించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరించి హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వం ఏమి చేసేందుకు అయినా సిద్ధంగా వుందని పేర్కొన్నారు. తమ నాయకుడు చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రజాప్రతినిధులంతా ఏ త్యాగానికైనా సిద్ధంగా వున్నారని అడ్డతీగల జెడ్‌పీటీసీ సభ్యురాలు ఆడారి కృష్ణవేణి, ఎంపీపీ అన్నం సత్తిబాబు తెలిపారు. చంద్రబాబు సారధ్యంలోనే ఆంధ్రాకు ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని మండల టీడీపీ అధ్యక్షుడు ఆడారి నాగబాబు పేర్కొన్నారు.

మావోల చేతిలో హతమైన
నాగేశ్వరరావు మృతదేహాన్ని అప్పగించిన పోలీసులు
ఐ పోలవరం, ఏప్రిల్ 17: రాష్ట్రంలో మావోల ఘాతుకానికి బలైన రోడ్డు పనుల సూపర్‌వైజర్ తెలగారెడ్డి బాలనాగేశ్వరరావు మృతదేహాన్ని ఐ పోలవరం పోలీసులు మంగళవారం సాయంత్రం బాణాపురంలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని చత్తీష్‌గఢ్ రాష్ట్రంలోని కుంట పోలీసు స్టేషన్ నుంచి పోస్టుమార్టం అనంతరం ఐ పోలవరం పోలీసులు అంబులెన్సులో బాణాపురం తీసుకువచ్చారు. మృతదేహాన్ని ఎస్సై దుర్గాశేఖర్‌రెడ్డి, హెచ్‌సీ సత్యరావు, సిబ్బందితో బాణాపురం వెళ్లి కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. అయితే మృతుడు నాగేశ్వరావు చత్తీస్‌గఢ్‌లో కిడ్నాప్ అనంతరం మావోలు చేతిలో బలైన సమాచారం గత రాత్రి బాణాపురంలో తెలియడంతో అప్పట్నుంచీ గ్రామస్థులు, కుటుంబీకులు నిరీక్షించారు. నాగేశ్వరరావుకు భార్య సత్యకుమారి, కుమార్తె కేతా రేవతి, అల్లుడు వెంకటేష్ ఉన్నారు. అయితే మంగళవారం ఉదయం నుంచి నాగేశ్వరరావు కడసారి చూపు కోసం బాణాపురంలోని కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థులు ఎదురు చూసిన క్షణాలు తీవ్రంగా కలచివేశాయి. ఈ దారుణాన్ని తలచుకుని మృతుడు నాగేశ్వరావుతో పనిచేసిన కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్ర 5 గంటల సమయంలో బాణాపురంలో నాగేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహించారు. నాగేశ్వరరావు హత్యవార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి చినరాజప్పను సంప్రదించి, ఆయన సహకారంతో మృతదేహాన్ని తొందరగా గ్రామానికి చేర్పించగలిగామని స్థానిక సర్పంచ్ రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు తెలిపారు.

216 జాతీయ రహదారిలో భద్రతా చర్యలు తీసకోవాలి
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ, ఏప్రిల్ 17: జిల్లాలోని 216 జాతీయ రహదారిలో విస్తరణ పనుల కారణంగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పోలీసు అధికారులను, జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 216 విస్తరణ పనుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. వీటి నివారణకు గుర్తించి ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లతో కూడిన సైన్‌బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. అదేవిధంగా ఏడీపీ రోడ్డు నుపు కారణంగా వాహనాలు వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని నివాణకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రోడ్డును సరిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో వేగంగా వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు స్పీడ్‌బ్రేకర్లను నిర్మించాల్సి ఉందన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్లు సాయికాంత్‌వర్మ, వి వినోద్‌కుమార్, కమిషనర్లు కె శివపార్వతి, విజయరామరాజు, డీటీసీ సిరి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.