తూర్పుగోదావరి

నిప్పులు చెరిగిన భానుడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 17: ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. భానుడు భగభగలతో జనం అల్లాడుతున్నారు. శీతలపానీయాలు దుకాణాలు పెరిగిపోయాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక ఎక్కడికక్కడ చల్లని పానీయాలు సేవిస్తూ జనం ఉపశమనం పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఉక్కపోతతో కూడిన వాతావరణం జన జీవనాన్ని చుట్టిముట్టేస్తోంది. రాజమహేంద్రవరంలో మంగళవారం గరిష్ణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతోన్న పరిస్థితి ఎదురైంది. నగరంలో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే, మే వచ్చే సరికి మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం మేఘావృతంగా మారింది.

11.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
*జిల్లా పౌరసరఫరాల శాఖ జీఎం కృష్ణారావు
కరప, ఏప్రిల్ 17: ప్రస్తుత రబీ సీజన్‌లో 11.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ ఎ కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన కరప సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. రైతులకు దళారుల బెడదలేకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, గత ఖరీప్ సీజన్‌లో 288 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుత ఖరీప్ సీజన్‌లో 246 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 30 కేంద్రాలు స్వయంశక్తి సంఘాల ద్వారా ఏర్పాటు చేయగా, 10 డిసియంఎస్ లు నిర్వహిస్తున్నాయని, మిగిలిన 206 కేంద్రాలు సొసైటీల అధ్వర్యంలో ఏర్పాటు చేసామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి కళ్లెంలోనే తేమ దృవపత్రాలు అందజేస్తామన్నారు. తేమ శాతం 17శాతం కన్నా తక్కువ ఉంటే సమీప మిల్లర్లు అక్కడికే వచ్చి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తారన్నారు. రబీలో రైతులు 80శాతం బొండాలు రకం పండిస్తారని, ఇవి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కావడం వల్ల లక్ష్యం మేరకు ధాన్యం సేకరించలేకపోతున్నామని తెలిపారు. గత ఖరీప్‌లో జిల్లాలో 288 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 13.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. జిల్లా గెయిన్ పర్జేజింగ్ అధికారి జోగారావు, సొసైటీ అధ్యక్షులు నక్కా భద్రం, సిఇ సలాది రామ్మోహననాయడు పాల్గొన్నారు.