తూర్పుగోదావరి

ప్రతిష్ఠాత్మకంగా జడ్పీ శతవసంతాల వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 17: జిల్లా ప్రజాపరిషత్ శతవసంత వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జడ్పీ శత జయంతి వేడుకల పతాకాన్ని చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప విలేఖరులతో మాట్లాడారు. 1917వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆవిర్భవించిందని, అంతకు జిల్లా బోర్డుగా పరిగణించేవారన్నారు. కాలక్రమంలో జిల్లా అభివృద్ధికి జడ్పీ ఎంతో కృషి చేసిందన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడిందని పేర్కొన్నారు. వచ్చే మేలో జిల్లా పరిషత్ శతవసంత వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేడుకలను ప్రారంభిస్తారని చెప్పారు. జడ్పీ ఏర్పడి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా పూర్వ అధ్యక్షులను సత్కరిస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ అధ్యక్షులుగా మల్లిపూడి పళ్ళంరాజు, తోట రామస్వామి, జీఎంసీ బాలయోగి వంటి ప్రముఖులు పనిచేశారన్నారు. బాలయోగి జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థాయి నుండి లోక్‌సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వైనాన్ని ప్రస్తుతించారు. వేడుకల్లో భాగంగా జిల్లా పరిషత్‌లో దివంగత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు చినరాజప్ప తెలిపారు. జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు శతవసంతాల వేడుకలకు సంబంధించిన పోస్టర్లు, పతాకాలను ఆవిష్కరించారన్నారు. బుధవారం ఎంఇవోల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్థులతో కలసి ర్యాలీలు నిర్వహిస్తారని జడ్పీ ఛైర్మన్ నవీన్ చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జడ్పీ సిఈవో ఆర్ గోవిందరావు, టీడీపీ నాయకుడు గోకేడ శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు నవీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.