తూర్పుగోదావరి

సాత్విక్‌ను సన్మానించిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 22: ఇటీవల కామనె్వల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్, మెన్ డబుల్స్‌లో బంగారు, సిల్వర్ పతకాలను సాధించిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం దుశ్శాలువా, జ్ఞాపికతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కోనసీమ కీర్తిప్రతిష్ఠలు ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహానికి కృషిచేస్తామని మంత్రి రాజప్ప అన్నారు.

సగం వేశారు.. సగం మరిచారు!
*రాజవోలు పంచాయతీలో రహదారి నిర్మాణం దుస్థితి
రాజమండ్రి, ఏప్రిల్ 22: రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామ పంచాయతీలో సగం అభివృద్ధి మాత్రమే కనబడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజవోలు గ్రామ పంచాయతీలో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగా ఎఎంజీ ఎదురుగా వెంకటేశ్వరనగర్-2లో ఏడాదిన్నర క్రితం సిమెంటు రోడ్డు నిర్మించారు. కాగా ఈ రోడ్డుకు పూర్తిగా నిధులు సరిపోలేదంటూ సగం వరకూ వేసి వదిలివేశారు. అనంతరం ఏడాదికాలంగా స్థానికులు పంచాయతీ ప్రెసిడెంట్ రామకృష్ణను రోడ్డు విషయమై అడుగగా రోడ్డుకు ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలలో మళ్లీ ఈ రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా రోడ్డు మంజూరయ్యిందని అయితే పంచాయతీ గ్రాంటుపై ట్రెజరీ బ్యాన్ ఉందని దీనివల్ల సిమెంటుకు బిల్లులు మంజూరు కావడంలేదన్నారు. మరి కొద్ది రోజులు పడుతుందని చెప్పారు. ఆదివారం రోడ్డు సమస్యపై ఆయనను అడుగగా బిల్లులు అన్నీ ఆన్‌లైన్ చేస్తున్నారని, ఆన్‌లైన్‌లోనే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. దీనికి మరికొంత సమయం పట్టవచ్చునన్నారు. అయితే సగం రోడ్డు మాత్రమే వేసి మిగిలిన రోడ్డు నిర్మించకపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రెయినేజీ నిర్మాణం కూడా లేకపోవడంతో వర్షం వస్తే సిమెంటు రోడ్డు ఉన్న ప్రాంతం నుండి దిగువకు నీరు రావడంతో స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే వర్షాకాలంలో తమకు ఇంకెన్ని ఇక్కట్లు ఉన్నాయోనని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా మిగిలిన సగం రోడ్డు నిర్మించి మోక్షం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.