తూర్పుగోదావరి

రేపు మంత్రి లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 22: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 24న రాజమహేంద్రవరం నగరంలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సేవలు అందించిన 250 మందికి అవార్డులను అందించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయిశ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ నేడు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రి సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందుగా బొమ్మూరు వెళ్ళి అక్కడ గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడతారు. అనంతరం ధవళేశ్వరం చేరుకుని అక్కడ ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక ఐదుబళ్ల మార్కెట్ వద్ద డ్రెయిన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత నాగులచెరువు బజారు మార్కెట్‌ను ప్రారంభిస్తారు. తదుపరి రాజమహేంద్రవరం ఎస్టీపీ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నారాయణపురం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో సూపర్ సిక్స్ విద్యార్థులతో మాట్లాడతారు. కంబాలచెరువు వద్ద డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు. కమిషనర్ విజయరామరాజు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేసింది.

బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

అమలాపురం, ఏప్రిల్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వాఖ్యలు చేసిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆదివారం అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ జిల్లా కార్యాదర్శి నల్లా పవన్‌కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొల్లి సూర్యారావు, గొకరకొండ గంగన్న స్వామిల ఆధ్వర్యంలో డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ డి దేవకుమార్‌కు ఫిర్యాదు అందజేశారు.