తూర్పుగోదావరి

ముఖ్యమంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 22: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 24న తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. మండపేట మండలం ద్వారపూడిలో ముఖ్యమంత్రి ముందుగా ఫ్లైఓవర్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం మండపేట బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి దగ్గరలోనే బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీకాప్టర్‌లో దిగి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వివిధ సంక్షేమ పధకాల్లో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాలు చేయనున్నారు. తాపేశ్వరం బైపాస్‌రోడ్డుకు శంకుస్థాపన, షాధీఖానా ప్రారంభోత్సవం, క్రైస్తవులకు కమ్యూనిటీహాలును ప్రారంభించనున్నారు. రూ.2.13 కోట్ల సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించనున్న రోడ్లు, డ్రెయిన్లకు శంఖుస్థాపన, రూ.3.50 కోట్లతో లింక్‌రోడ్లుకు శంకుస్థాపన, స్ర్తిశక్తి భవనానికి శంకుస్థాపన, పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు పంపిణీ చేసి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసింది.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు
*ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప
ఉప్పలగుప్తం, ఏప్రిల్ 22: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర వైద్యశాలలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల, అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని శ్రీ నిమ్మకాయల చినరాజప్ప కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిభిరాన్ని మంత్రి రాజప్ప, అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ధైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు బారీన పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఈ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రతీ ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తోందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి ఉచిత వైద్యశిభిరాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ వైద్య శిబిరంలో గుండె వ్యాది, ఊపిరితిత్తులు, ఎముకలకు సంబంధించిన వైద్య విభాగాలతోపాటు కంటి పరీక్షలు, ఈఎన్‌టీ విభాగం నుండి స్ర్తిలకు సంబంధించిన విభాగాలతో జనరల్ మెడిసిన్, జనరల్ శాస్త్ర చికిత్స చిన్న పిల్లల విభాగం, డెంటల్ విభాగం, చర్మవ్యాధుల, చక్కర వ్యాధి సంబంధిత వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.