తూర్పుగోదావరి

క్రీడలు దేశగౌరవాన్ని పెంపొందిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఏప్రిల్ 22: క్రీడలు దేశగౌరవాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం స్థానిక టౌన్‌హాల్ టెన్సీస్ కోర్టులో సర్కార్ టెన్నీస్ చాంపియన్‌ఫిప్ ఆల్‌ఇండియా నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను డిప్యూటీ సిఎం చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసంవత్సరం అంతర్జాతీయంగా జరిగిన వివిధ క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి ఎక్కువ పథకాలు క్రీడాకారులు ఆర్జించి దేశ ఔనత్యాన్ని చాటారని కొనియాడారు. తన చిన్నతనంలో నిమ్మకాయల నాయుడుతో కలసి టౌన్‌హాలుకు వచ్చేవాడినని గుర్తుచేశారు. నేడు ఇదే టౌన్‌హాల్ సేవాకార్యక్రమాలను వీక్షించడం జరుగుతోందని చెప్పారు. టెన్నీస్ క్రీడలోకి విద్యార్ధులు ఎక్కువ మంది రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని పెద్దాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రితోపాటు ప్రధానపట్టణాల్లో టెన్నీస్ క్రీడాభివృద్ధికి కృషిచేయడమే కాకుండా సింతటిక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలుతీసుకుంటున్నట్లు రాజప్ప చెప్పారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న లాంగ్ టెన్నీస్ అసోసియేషన్ కర్యాదర్శి టోర్నమెంట్ డైరెక్టర్ పివి రామకుమార్ మాట్లాడుతూ తొలిసారిగా మహిళా జాతీయ ర్యాంకింగ్ పోటీలను కాకినాడ నగరంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. పలు రాష్ట్రాల నుండి సుమారు 120మంది క్రీడాకారులు ఈపోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈపోటీలు టౌన్‌హాల్, మెడికల్ కళాశాల, హెలికాన్‌టైమ్స్, కాస్సామపోలిటిన్ క్లబ్ టెన్నీకోర్టుల్లో ఈనెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. టౌన్‌హాలులో జరిగిన ప్రారంభ పోటీని టౌన్‌హాల్ కోశాధికారి వెత్సా ఆనంద్ స్వాగతంతో పోటీలు లాంచనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెలే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాతుతూ 1964నుండి టెన్సీస్ టోర్నమెంటులను టౌన్‌హాల్ కమిటీ నిర్వహిస్తు క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులను చినరాజప్ప సత్కరించారు.

రాజీనామాలతో ఒరిగేది ఏమీలేదు
*అమలాపురం ఎంపీ పండుల
కొత్తపేట, ఏప్రిల్ 22: ఎంపీ పదవులకు రాజీనామా చేయటం వల్ల ఒరిగేది ఏమీలేదని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. కొత్తపేటలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పదవులకు రాజీనామా చేయటం కేవలం రాజకీయమైన డ్రామాగా ఆయన అభివర్ణించారు. ప్రత్యేక హోదా కోసం దేశం ఎంపీలు స్వచ్ఛమైన పోరాటం చేసినట్లు తెలిపారు. హోదా కోసం తాము పోరాటం చేస్తుంటే తమ పోరాటాన్ని కుక్కలతో పోల్చారని ఇది చాలా దారుణమైన విషయం అన్నారు. ప్రధాన మంత్రి ఇంటిని ముట్టడించామంటే దానికి దమ్ము ధైర్యం కావాలని కాని తాము ధైర్యంగా ముట్టడి చేసినట్లు తెలిపారు. హోదా విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. హోదా కాదు దానికి సరిసమానమైన ప్యాకేజీ ఇస్తానంటే దానిని కూడా నమ్మినట్లు తెలిపారు. కానీ వారిపై ఉంచిన నమ్మకాలను వమ్ము చేసారని ఇది చాలా దారుణమైన విషయం అన్నారు. దీనికి బీజేపీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.