తూర్పుగోదావరి

మిలీనియమ్ మార్చ్‌ను జయప్రదం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక విజయవాడలో నిర్వహించిన చారిత్రక సదస్సు పిలుపు మేరకు మిలీనియమ్ మార్చ్‌ని విజయవంతం చేయాలని వేదిక నాయకులు కోరారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మాజీ ఎంపి జివి హర్షకుమార్ తనయుడు జివి శ్రీరాజ్, పలువురు దళిత నాయకులు విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు. నాగార్జున యూనివర్సిటీ గుంటూరు నుంచి మంగళగిరి వరకు పది కిలోమీటర్ల మేర లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీలు పాల్గొనే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామని శ్రీరాజ్ చెప్పారు. జిల్లాల వారీగా నాయకులు పర్యటించి జాతిని జాగృతం చేయాలని నిశ్చయించుకుని ఆయా జిల్లాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శ్రీరాజ్ నాయకత్వంలో ముందుగా ఒక బృందం పర్యటించనుందని నాయకులు తెలియజేశారు. ఈ ప్రధానమైన బృందంలో మాజీ ఎంపీలు చింతా మోహన్, జేడీ శీలం, జెల్లి విల్సన్ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ బృందం ఏప్రిల్ 25న శ్రీకాకుళం, విజయనగరం, 26న విశాఖపట్నం, 27న రాజమండ్రి, ఏలూరు, 28న విజయవాడ, గుంటూరు, 29న ఒంగోలు, నెల్లూరు, 30న తిరుపతి, కడప, మే 1న కర్నూలు, అనంతపురం పర్యటించనున్నట్టు మాజీ ఎంపి జీవీ హర్షకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

శ్రీసత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు
అన్నవరం, ఏప్రిల్ 25: భక్తుల పాలిట కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీసత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా తొలిరోజైన వైశాఖశుద్ధ దశమి బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను వధూవరులను చేశారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు, క్షేత్ర పాలకులైన శ్రీసీతారాములు వెంట రాగా, స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా అనివేటి మండపానికి తోడ్కొని వచ్చారు. ప్రత్యేక ఆసనాలపై సీతారాములును, వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించిన వెండి సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసిన అనంతరం ముత్తయిదువలు పసుపు దంచారు. కాగా రాత్రి 7గంటలకు శ్రీరాజా వెంకట రామరాయ కళావేదిక నందు స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ ఐవి రోహిత్‌కుమార్, కార్యనిర్వహణాధికారి ఎం జితేంద్ర, అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి జగన్నాథరావు, పాలకమండలి సభ్యులు మట్టే సత్యవరప్రసాద్, ఏఈవో వైఎస్సార్ మూర్తితోపాటు దేవస్థానం ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను వైధిక కమిటీ సభ్యులైన నాగాభట్ల కామేశ్వరశర్మ, ఎం సత్యనారాయణ, వేదపండితులైన యనమండ్ర శర్మ, కపిలవాయి రామశాస్ర్తీ తదితరులు నిర్వహించారు.