తూర్పుగోదావరి

పట్టు వీడని భార్య - మెట్టు దిగని భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 26: తనను కాపురానికి తీసుకెళాలన్న ప్రధాన డిమాండుతో అమలాపురం సీటీవో యన్నం వెంకటేశ్వర్లు సతీమణి అంకమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి గత నాలుగు రోజులుగా స్థానిక కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నాను గురువారం ఆయన నివాసం ఉండే అద్దె ఇంటి ముందుకు మార్చారు. ఈ నెల 23 నుండి స్థానిక కూచిమంచి అగ్రహారంలో గల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నా భర్త కనీసం స్పందించకపోవడం, కార్యాలయానికి రాకపోవడంతో స్థానిక సూర్యా నగర్‌లో నివాసం ఉంటున్న సీటీవో ఇంటి ముందు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తన భర్త మనస్సు మార్చాలనే ఉద్దేశ్యంతోనే తాను శాంతియుతంగా దీక్ష చేస్తున్నాని, ఏదో ఒకరోజు తనను ఇంట్లోకి ఆహ్వానించి ఆదుకుంటారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. తనకు రెండు పూటలా పట్టెడన్నం పెట్టి ప్రేమగా చూసుకుంటే చాలని, తాను ఆయన నుండి ఇంకేమీ ఆశించడంలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఇక్కడ ఎవ్వరూ తెలియదని, తనకు స్థానికంగా ఉండే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు సహకరించి తన కాపురం నిలపాలని ఆమె అర్థిస్తున్నారు.