తూర్పుగోదావరి

బాలాజీపేట విస్తరణ : స్థానికులు గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 26: నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం స్థానిక బాలాజీపేట విస్తరణ పనులు చేపట్టింది. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు విస్తరణ చేపట్టడం వల్ల దారుణంగా నష్టపోతున్నామని స్థానిక బాలాజీపేట పట్ట్భాములు కలిగిన స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. 1983 ప్రాంతంలో తమకు పట్టాలిచ్చిన ప్రాంతంలోనే అప్పట్లోనే అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినట్టుగా సెట్‌బ్యాక్‌లు వదిలేసి ఇళ్లను నిర్మించుకున్నామని చెపుతున్నారు. 2002 పుష్కరాల సమయంలో ఒకసారి, అంతకంటే ముందు ఒకసారి విస్తరణ పనులు చేపట్టారని, అప్పట్లోనే అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించిన మేరకు విస్తరణ చేశారని, ఇలా మళ్లీ మళ్లీ విస్తరణ చేపట్టడం వల్ల అసలు ఎక్కడ నివసించాలో అర్ధం కావడం లేదని, తమకు ఇచ్చిన పట్టా స్థలమంతా విస్తరణలోనే పోతే ఇక ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్ అధికారులు చెప్పాపెట్టకుండా వచ్చి విస్తరణ పనులు చేపట్టారని, దీంతో మెట్లు, ఇళ్లల్లోకి వెళ్లే దారి కూడా లేకుండా స్థలాన్ని కోల్పోవడం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. రోడ్డు పాయింట్‌కు అటూ ఇటూ ఎంతెంత మేర విస్తరిస్తున్నారో కూడా తెలియకుండా తొలగిస్తున్నారని అంటున్నారు. ఒక వైపు అత్యధికంగా నష్టపోవడం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి అనివార్యమని, అయితే మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. ఇదిలావుండగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోడ్డును సెంట్రల్ డివైడర్, సెంటర్ లైటింగ్‌తో అటు 16వ నెంబర్ జాతీయ రహదారి బొమ్మూరు జంక్షన్ వరకు విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు భారీగా నిధులు కేటాయించి వౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ మార్గంలోనే భారీ డ్రెయిన్ ఉండే ప్రాంతంలో భారీ కల్వర్టును నిర్మించి, రోడ్డు విస్తరణ చేయడం వల్ల ఈ ప్రాంత స్వరూప స్వభావమే మారే అవకాశముంది. ఎప్పుడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తితే ఆర్టీసీ బస్సులను సైతం ఐఎల్‌టీడీ జంక్షన్ నుంచి బాలాజీపేటగా మళ్లిస్తున్నారు. ఈ రోడ్డు ప్రత్యామ్నాయ ప్రధాన రహదారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తూర్పు రైల్వేస్టేషన్ రహదారితో ఇటు బాలాజీపేట, అటు సావిత్రినగర్ 100 అడుగుల రోడ్డుతో జాతీయ రహదారిని అనుసంధానం చేసే ఈ రోడ్డులో స్థానిక ప్రాంతానికి వెలివేషన్ వచ్చింది. అయితే బాలాజీపేట రోడ్డులో దీర్ఘకాలంగా ఉన్న అపార్టుమెంట్ స్థలం అడ్డాన్ని తొలగించుకోవడంలో మాత్రం రోడ్డు సమస్యను కోర్టుపరంగా పరిష్కరించుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధి కృతకృత్యులు కాలేకపోయారు. దీంతో ఈ రోడ్డును ఎంత అభివృద్ధి చేసినా ప్రధాన అడ్డంకి వెంటాడుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ పెద్దోళ్ల జోలికి వెళ్లకుండా పేదోళ్ల విషయంలో మాత్రం అధికారులు ఒంటికాలిపై లేస్తూ పదేపదే ఈ రోడ్డులో విస్తరణతో తమను అస్తవ్యస్థం చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

‘అక్నూ’లో రూ.7.5కోట్లతో వౌలిక సదుపాయలు
*వీసీ ఆచార్య ముత్యాలనాయుడు

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 26: ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అక్నూ)లో ప్రస్తుతం రూ.7.5 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌ల వంటి వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందని వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు చెప్పారు. గురువారం వీసీ ఈ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, అనుబంధ రోడ్లు, డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే యూనివర్సిటీ స్వరూపమే మారిపోతుందని, 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని యూనివర్సిటీ సింహద్వారం నుంచి యూనివర్సిటీలో ప్రధాన రహదారి సీసీ రోడ్డుగా నిర్మాణమవుతోందన్నారు. ఈ వౌలిక సదుపాయాల ఇప్పటి చవిచూసిన అసౌకర్యాలు తొలగిపోనున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ తరగతులకు శెలవులు కావడంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ఈ పనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంజనీర్ ఏవీ కృష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్ లింగారెడ్డి, డీన్ డాక్టర్ ఎ మట్టారెడ్డి, ఎం కిరణ్‌కుమార్, ప్రేమ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.