తూర్పుగోదావరి

ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ సేలరీ ప్యాకేజ్ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 26: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్ధం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేలరీ ప్యాకేజీ పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టిందని, ఈ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గురువారం ఎస్‌బీఐ ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేలరీ ప్యాకేజీ శిబిరాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం గురించి మిశ్రా మాట్లాడుతూ ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కలిగించాలన్నారు. కలెక్టరేట్‌లోని ఉద్యోగులకు పథకంపై ప్రత్యేక అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్వో ఎస్వీఎస్ సుబ్బలక్ష్మికి సూచించారు. ఉద్యోగులకు తక్కువ కాలంలో వ్యక్తిగత రుణాల మంజూరు, ఇన్సూరెన్స్ పథకాల ద్వారా పెన్షన్ చెల్లింపునకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అమలుచేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం డీజీఎం గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేట్ సంస్థలు, పారా మిలటరీ, డిఫెన్స్, పోలీస్, నేవీ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నందున ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ప్రజలకు త్వరితగతిన అందజేస్తోందన్నారు. గృహ రుణాలు, కారు, ప్రాపర్టీ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్లు త్వరితగతిన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ కాకినాడ రీజనల్ మేనేజర్ రాజారామ్మోహన్‌రావు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్‌లో సేలరీ ఖాతా ప్రారంభిస్తే ప్రతి నెలా జీతం జమ అవడంతో పాటు ప్రమాదాలు జరిగిన పక్షంలో ఏక్సిడెంటల్ కవరేజీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సేలరీ ప్యాకేజీ పథకం, బంధన్ పర్శనల్ లోన్స్ పథకాలతో చాలా ప్రయోజనాలున్నాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు తక్కువగా ఉంటుందని చెప్పారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరుచుకోవచ్చని, ఏ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం నుండైనా, ఎన్నిసార్లైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ మరణానికి 20 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పారు. పథకం కింద ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా సుమారు 15 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ కో-ఆర్డినేటర్ హనుమంతు, వివిధ బ్రాంచ్‌ల మేనేజర్లు కె పార్వతి, కృష్ణమోహన్ ఆచారి, సత్యనారాయణ, కిరణ్మయి, రాజశేఖర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే
*బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలి - అంబేద్కర్ మునిమనవుడు అశోక్ అంబేద్కర్
కాట్రేనికోన, ఏప్రిల్ 26: బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యావంతులు కావడం ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, చట్ట సభల్లో ప్రాతినిధ్యం పొంది రాజ్యాధికారం సాధించాలని అంబేద్కర్ మునిమనవుడు, బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాజారత్నం అశోక్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం చెయ్యేరు గ్రామంలోని వడ్డివారిపేటలో సర్పంచ్ ముడిదుడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. స్థానికంగా నెలకొల్పిన అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని, గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అశోక్ అంబేద్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలను అందరూ బలపరిచి రిపబ్లికన్ పార్టీ తరుపున ఎమ్మెల్యే, ఎంపీలను చట్టసభలకు పంపించి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఓట్లు శాతం లేని అగ్రకులాలకు అధికారం ఇస్తూ మెజార్టీ ఓట్లు ఉన్న బలహీన వర్గాలు ఎంతకాలం మోసపోతారని, అధికారం కోసం పోరాటం చేయాల్సిందేనని ఆయన అన్నారు. 1932లో పోరాటం చేసి అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్‌లకు నేడు ముప్పు కలుగుతోందని ఆశోక్ అంబేద్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిందని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేవని, వీటీపై దృష్టి సారించాలన్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారానే బిచ్చగాడు సైతం రాజకీయ అవకాశం వచ్చిందని, నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ వంటి నాయకులు జైభీమ్ అంటూ జపం చేస్తున్నారంటే అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు పుణ్యమేనన్నారు. ఐఏఎస్ అధికారి పీఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పడం కంటే ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కోరారు. అంబేద్కర్ అందరి వాడని, ఆయన ఆలోచనా విధానమే దేశానికి శరణ్యమన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవస్థను తీసుకువచ్చిన మహనీయుడు అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పాటుపడాలన్నారు. విజయవాడ రైల్వే డీఎస్పీ మోకా సత్తిబాబు తన ప్రసంగంలో ఆసియా ఖండంలోనే అంబేద్కర్ అపర మేధావిగా నిలిచారంటే ఆయన చదివిన ఉన్నత చదువులేనన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచి వారసులుగా నిలవాలని సత్తిబాబు కోరారు. కార్యక్రమంలో దిగంబర కాంబ్లే, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు, టీడీపి అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మోకా ఆనందసాగర్, పెయ్యల చిట్టిబాబు, గొలకోటి దొరబాబు, నల్లా నరసింహమూర్తి, నాతి సత్యనారాయణ, పొద్దోకు నారాయణ రావు, నడింపల్లి సూరిబాబు, మట్టా వెంకటరావు, కన్నీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.