తూర్పుగోదావరి

పంచాయతీల అభివృద్ధికి ఆదాయమార్గాలను అనే్వషించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, మే 21 : పంచాయతీల అభివృద్ధి, పాలన మెరుగుకు ప్రధానంగా పంచాయతీల పరిధిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరులను అనే్వషిస్తూ ఆదాయాబివృద్ధిపై స్థానిక సంస్థల అధికారులు దృష్టి పెట్టాలని స్థానిక విస్తరణా శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ డిఎం సెల్వియా పిలుపునిచ్చారు. స్థానిక విస్తరణా శిక్షణా కేంద్రంలో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీడీవోలు, ఈవోపిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు మొదటి బ్యాచ్ శిక్షణా తరగతులను వైస్ ప్రిన్సిపల్ సెల్వియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ పంచాయతీ అయినా అబివృద్ధి సాధించాలంటే ఆర్థికంగా మెరుగుపడాలన్నారు. తద్వారా పంచాయతీల పాలన అబివృద్ధి పనులు వంటి కార్యక్రమాలను చేపట్టడం సాధ్యమవుతుందన్నారు. అయితే ప్రధానంగా పంచాయతీలకు ఆదాయాన్ని సంపాదించే వనరులపై అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందించిన గైడ్‌లైన్సును ఆధారంగా తీసుకుని ఆదాయ మార్గాలను అనే్వషించాలన్నారు. ఇంకా పంచాయతీ చట్టాలు, వాటి అమలు, అబివృద్ధి వంటి అంశాలపై 2018-19 సంవత్సరానికి గానూ యాక్షన్ ప్లాన్ తయారీకి నిర్ధేశించిన సూచనలను తెలుసుకుని ఆయా మండలాల్లో అధికారులు, సిబ్బందికి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. కాగా ఈ శిక్షణలో ఇంకా కేంద్రం ఎంపీడీవోలు జిఎస్ రామ్ గోపాల్, ఎన్‌వివిఎస్ మూర్తి, సీనియర్ ఫ్యాకల్టీలు జె రాంబాబు, జూనియర్ ప్యాకల్టీలు ఎ గోపాలరావు, టిఎల్‌ఎన్‌వి రాజా, ఆర్పీలు శేషుబాబు, రవిశాస్ర్తీ తదితరులు పలు అంశాలపై వివరించారు. కాగా ఐదు జిల్లాలకు చెందిన 80 మంది పంచాయతీ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.