తూర్పుగోదావరి

కలసి పనిచేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 21: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం నేపథ్యంలో అసమ్మతి రాగం ఆలపించిన నేతలు ఎట్టకేలకు అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యమన్నారు. పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా ఇకపై పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త అధ్యక్షుడికి అసమ్మతినేతలు అభినందనలు తెలియజేశారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను నియమించడంతో జిల్లాలోని సోము వీర్రాజు వర్గం అగ్గిమీద గుగ్గిలమైన విషయం విధితమే! సోమును రాష్ట్ర రథసారధిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, రాజమహేంద్రవరం అధ్యక్షుడు దత్తు తదితరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసి, ఆర్గనైజేషన్‌లో నమ్ముకుని ఉన్న సోము వీర్రాజునే అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేసి పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో విజయవాడలో పార్టీ సమావేశానికి హాజరు కావల్సిందిగా అగ్రనేతల నుండి అందిన సమాచారం మేరకు మాలకొండయ్య, దత్తు తదితరులు సోమవారం తరలివెళ్ళారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు అసమ్మతివాదులను బుజ్జగించడంతో కథ సుఖాంతమైంది. ఆయా పదవుల్లో నియామకాలపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని ముఖ్యనేతలు సూచించారు. చర్చల అనంతరం సోము వర్గానికి చెందిన నేతల్లోని అసమ్మతిని చల్లార్చడంతో పాటు అక్కడికక్కడే వారిచే రాజీనామాలను ఉపసంహరించుకునేలా పార్టీ ముఖ్యనేతలు చేయగలిగారు. అనంతరం కన్నాను కలసిన సోము వర్గం కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు గాను అభినందించింది. కాగా ఇక నుండి జిల్లాలో గ్రూపులకు తావులేకుండా పార్టీ అభ్యున్నతికి కలసిపనిచేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యంగా భావించి తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. సుదీర్ఘకాలంగా పార్టీతో అనుబంధాన్ని కలిగివున్న తమకు పార్టీ అభ్యున్నతే ప్రథానమని పేర్కొన్నారు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా గ్రూపులకు తావులేకుండా కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలసి శుభాకాంక్షలు తెలియజేసినట్టు ఆయన తెలియజేశారు.

మావోయిస్టుల బంద్ పాక్షికం
మారేడుమిల్లి, మే 21: తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మవోయిస్టులు తలపెట్టిన బంద్ పాక్షికంగా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మవోయిస్టులు తలపెట్టిన బంద్ కారణంగా మారేడుమిల్లి నుండి వై రామవరం మండలం ఎగువ ప్రాంతాలకు వెళ్లే గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు వై రామవరం మండలం పాతకోట వరకు వెళ్లాల్సిన బస్సులు మారేడుమిల్లి మండలం బొడ్లంక గ్రామం వరకూ మాత్రమే పరిమితం చేశారు. మవోయిస్టులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించారు. మారేడుమిల్లి నుంచి ఎగువ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి ఉన్న కల్వర్టులను నిశితంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాలైన పాతకోట, కానివాడ, బంద, ఆకుమామిడికోటల నుండి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి, అనుమానితులను ప్రశ్నించారు. ఈ తనిఖీల్లో మారేడుమిల్లి సీఐ వై రవికుమార్, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు తులసీరామ్, నాగేశ్వరరావులు, పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ, మే 21: ప్రజావాణి- మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులు, అర్జీలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి సుమారు 286 అర్జీలను కలెక్టర్, జెసిలు స్వీకరించారు. అందిన దరఖాస్తులను పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియోకానె్ఫరెన్స్‌ను నిర్వహించి సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఇళ్ళు, ఇళ్ళ స్ధలాలు కావాలని, భూతగాలు పరిష్కరించాలని పలు అర్జీలను కలెక్టర్‌కు అందించారు. ఇంకా అందిన దరఖాస్తులను జెసి మల్లికార్జునతో పాటుగా డిఆర్‌ఓ ఎస్‌విస్ సుబ్బలక్ష్మిలు సమస్య పరిష్కరించే నిమిత్తం అక్కడున్న అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రజావాణిలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.