తూర్పుగోదావరి

జూన్ 1న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 22: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జూన్ ఒకటో తేదీన జారీ కానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 15,19,23 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. తొలి దశ ఎన్నికలకు సంబంధించి జూన్ మూడు నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. నాలుగున నామినేషన్ల స్క్రూట్నీ అనంతరం 5న అభ్యర్థుల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆరున ఫిర్యాదులను పరిశీలించి, జూన్ 7వ తేదీన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అదే రోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, జూన్ 15న పోలింగ్ నిర్వహిస్తారు. రెండవ దశ ఎన్నికలకు సంబంధించి జూన్ 7వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 8వ తేదీన స్క్రూట్నీ, 9న ఫిర్యాదుల స్వీకరణ, 10వ తేదీన పరిశీలన నిర్వహిస్తారు. అదేరోజు గుర్తులు కేటాయించి 19వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికలకు సంబంధించి 11న నామినేషన్లు స్వీకరిస్తారు. 12న స్క్రూట్నీ నిర్వహించి, 13న ఫిర్యాదులు స్వీకరిస్తారు. 14న ఫిర్యాదులు పరిశీలించి, 15న అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తారు. అదేరోజు గుర్తులు కేటాయించి 23న పోలింగ్ నిర్వహిస్తారు. మూడు దశల ఎన్నికల్లో పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గ్రామస్థాయిలో రాజకీయం వేడెక్కుతోంది. సర్పంచ్‌ల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో ప్రథాన రాజకీయ పార్టీల నేతలు గ్రామాలపై పూర్తిగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల సంరంభానికి ముందుగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించింది. బూత్‌ల వారీ ఓటర్ల జాబితాలపై కసరత్తు చేస్తోంది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నికల సామాగ్రి కేటాయింపు, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకాలపై కసరత్తు చేస్తోంది.