తూర్పుగోదావరి

రుణాల లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మే 24: బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలను లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అందించేందుకు ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆర్డీవో బి వెంకటరమణ ఆదేశించారు. గురువారం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో వివిధ కార్పొరేషన్ రుణాలు, ఎన్‌ఆర్‌ఈజిఎస్, గృహ నిర్మాణాలపై ఎంపిడీవోలు, ఏపీవోలతో ఆర్డీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి డివిజన్‌లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,966 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంకాగా 2,169 మందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో రుణాలు పంపిణీ 1,684 మందికి అనగా 78.58 శాతం జరిగిందని అన్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా 3,275 మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా 1,347 మందికి ఇప్పటి వరకు రుణాలు మంజూరు చేశామన్నారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలు పెంచేలా చర్యలు తీసుకుని రోజు కూలీ 205 రుపాయలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన వివిధ పనుల లక్ష్యాలకు సంబందించి ఆర్డీవో ఆరా తీసారు. ఉపాధి హామీ పథకంలో ఆట స్థలాలు 59 నిర్మించాలనేది లక్ష్యం కాగా 19 పూర్తి అయ్యాయని, 38 ప్రగతి దశలో ఉన్నాయని, పంట పొలాల్లో నీటికుంటలు (్ఫరంపాండ్స్) 492 లక్ష్యంకాగా 55 పూర్తి అయ్యాయని 171 ప్రగతి దశలో ఉన్నాయని ఆర్డీవో తెలిపారు. శ్మశాన వాటికలు 75 లక్ష్యంకాగా 2 మాత్రమే పూర్తి అయ్యాయని, 25 ప్రగతి దశలో ఉన్నాయని, అలాగే చేపలు ఎండబెట్టే కళ్లాలు 12 లక్ష్యం కాగా 12 ప్రగతి దశలో ఉన్నాయని వివరిస్తూ వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటు యూనిట్లు 35 పూర్తి అయ్యాయని, 54 ప్రగతి దశలో ఉన్నాయని ఆర్డీవో తెలియజేస్తూ ప్రగతి దశలో ఉన్నా పనులు అన్ని సత్వరం పూర్తి చేయాలన్నారు. అమలాపురం గృహనిర్మాణ పధకంలో లబ్ధిదారులకు మే 18వ తేదీ వరకు చెల్లించాల్సిన బిల్లులు వారి ఖాతాల్లోకి బదిలీ కాబడిందని, అలాగే ఎన్‌టీఆర్ రూరల్ గృహ నిర్మాణ పధకంలో మార్చి 27 వరకు చెల్లించాల్సిన బిల్లులు లబ్ధిదారుల ఖాతాల జమ చేయడం జరిగిందని హౌసింగ్ ఈఈ ఎన్ గణపతి వివరించారు. ఉపాధి పథకంలో చెల్లించాల్సిన నిధులు పెండింగ్ లేకుండా గ్రాంటు రిలీజ్ చేయడం జరిగిందని ఈఈ తెలిపారు. సమావేశంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ ఎస్ నారాయణరాజు, అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఏపీవోలు పాల్గొన్నారు.