తూర్పుగోదావరి

మరో చరిత్రకు మైలురాయి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 24: స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2003 పాదయాత్రకు వచ్చేటపుడు అఖండ రీతిలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన వద్ద సాంస్కృతిక స్వాగతం పలికిన నేపధ్యంలో ఆ చరిత్రను తిరగరాస్తూ ఇపుడు జగన్ పాదయాత్రకు రాజమహేంద్రవరంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు సన్నాహాలు చేపట్టాయి. జగన్ పాదయాత్ర అడుగు మరో చరిత్రకు మైలురాయి కావాలని నేతలు ఆకాంక్షిస్తూ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తామని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్‌లకు నాయకులు భరోసా ఇచ్చారు.
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర సన్నాహాక సమావేశం రాజమహేంద్రవరం చెరుకూరి కల్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జగన్ పాదయాత్ర ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర జూన్ 11వ తేదీన జిల్లాకు చేరుకునే విధంగా నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గంలో 15 కిలో మీటర్లకు తక్కువ కాకుండా సుమారు 300 రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర సాగేందుకు అవకాశం ఉందని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రెండు మూడు రోజుల్లో రూట్‌మ్యాప్ సిద్ధం కానుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవినీతిని బట్టబయలు చేస్తూ జగన్మోహన్‌రెడ్డి యాత్ర సాగనుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన భరోసా కల్పిస్తారన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఇసుక అవినీతిపై తమ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎలుగెత్తి చాటితే టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారని, దౌర్జన్యకరంగా రెచ్చిపోతున్నారంటే ఇది టీడీపీ అధ్వాన్న పాలనకు ఒక ఉదాహరణగా అద్దం పడుతుందని ఆరోపించారు. తాగునీటి సమస్యలు వుంటే పరిష్కరించకుండా టీడీపీ నాయకులు ఇసుకపై మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నారన్నారు. పాదయాత్ర జరిగే ప్రతీ నియోజకవర్గంలోనూ ప్రజా సమస్యలపై జగన్ ఆలోచన విధానం వెల్లడిస్తారన్నారు. జగన్ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు మించి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని 2000 కిలో మీటర్ల మైలురాయిని దాటడం జరిగిందన్నారు. జగన్ పాదయాత్ర ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేస్తామని జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. బూత్ కమిటీల వారీగా బాధ్యతలు తీసుకుని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. వివిధ కమిటీల ద్వారా నాయకులు కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
జగన్ పాదయాత్ర కొవ్వూరు నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా రాజమహేంద్రవరంలో ప్రవేశించనుంది. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహానికి స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ వద్ద నివాళి అర్పించి అనంతరం పాదయాత్రను ముందుకు సాగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగతం పలికేందుకు సుమారు లక్ష మందిని సమీకరించాలని చర్యలు చేపట్టారు. బస్సులు, వివిధ రకాల వాహనాలతో జన సమీకరణ చేయాలని సమాయత్తమయ్యారు. వైఎస్ స్మృతిపధంలో అప్పటి స్వర్గీయ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు స్ఫూర్తిగా జిల్లా ఒక మైలురాయిగా జన సమీకరణ పార్టీకి మైలేజీగా ఏర్పాట్లలో బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు, ఇపుడు జగన్ పాదయాత్రకు పార్టీ బాధ్యుడుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి 2003లో వచ్చినపుడు గౌతమీ గోదావరి నదిలో స్నానమాచరించి విశ్రాంతి అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించారని, ఇపుడు జగన్ కూడా అదే విధంగా గోదావరి నదిలో స్నానమాచరించి తూర్పులోకి ప్రవేశించడం సెంటిమెంట్‌గా పరిగణించి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కుడిపూడి చిట్టబ్బాయి, పొన్నాడ సతీష్, అల్లూరి కృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్, వైసీపీ యువత రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పరిశీలకుడు మోసేన్‌రాజు, రాజమహేంద్రవరం రూరల్ ఇన్‌చార్జి ఆకుల వీర్రాజు, ఉభయ గోదావరి జిల్లాల మహిళా విభాగం కన్వీనర్ శ్రీ లక్ష్మి తదితరులు పలు సూచనలు చేస్తూ మాట్లాడారు.