తూర్పుగోదావరి

జడ్పీలో ఇసుకాసుర అవతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 24: జిల్లా పరువును బజారుకీడ్చే స్థాయికి జిల్లా ప్రజా పరిషత్ వేదికగా ప్రజాప్రతినిధులు ప్రవర్తించారు. ఓ వైపు జిల్లా పరిషత్ శత వసంతాల సంబర ఏర్పాట్లు చేస్తూనే, ఇంకోవైపు జడ్పీ వేదికగా అవినీతి ఆరోపణలను జీర్ణించుకోలేక ఒకరిపైనొకరు కత్తులు నూరుకున్నారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించేందుకు, సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజా పరిషత్ సమావేశాన్ని చూడకుండా, ఎవరేమనుకుంటారో అనే ఇంగితాన్ని వదిలి రసాభాసకు దిగారు. జడ్పీలో జరిగిన ఇసుక దందా దుమారంపై ప్రజాప్రతినిధులు దూషణలకు దిగితే, అధికారులు ఎంచక్కా ఎంజాయ్ చేశారు. జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ అధ్యక్షతన జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమయ్యింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంలోనే అక్రమ ఇసుక రవాణాపై దుమారం చెలరేగింది. అయితే చిత్రంగా అధికార, ప్రతిపక్ష నేతలు ఇసుక సమస్య పరిష్కారం అంశాన్ని పక్కన పెట్టి, ఒకరి అక్రమాలపై మరొకరు పరస్పరం నిందించుకున్నారు. శాసన మండలి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మధ్య చెలరేగిన ఈ వివాదాన్ని చూసి సహచర సభ్యులే నివ్వెరపోయారు. మొత్తంమీద జిల్లాలో ఇసుక మాఫియాను కంట్రోల్ చేయాల్సిన వారే ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కోవల్సి రావడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. సమావేశం రసాభాస కావడంతో 15 నిముషాల పాటు జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ వాయిదా వేశారు. సభ పునఃప్రారంభం కాగా ఎమ్మెల్యేల కంటే జడ్పీటీసీలు మాత్రమే సమస్యలను వివరించాలంటూ జడ్పీ ఛైర్మన్ ముందుజాగ్రత్తగా ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇసుక ఉచితంగా అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల ఇండెంట్లను పరిగణలోకి తీసుకుని ఇసుకను సరఫరా చేస్తున్నామని చెప్పారు. అక్రమాలేమన్నా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఛైర్మన్ సభ్యులను కోరారు. జిల్లాలో పంట కాల్వలకు సంబంధించి క్లోజర్ పనులు పూర్తి కానందున మరో రెండు వారాల పాటు నీటి విడుదలను వాయిదా వేయాలని సమావేశంలో కొందరు సభ్యులు కోరారు. దీనిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పందిస్తూ జూన్ 1వ తేదీనే కాలువల ద్వారా పంటలకు నీరిస్తామని ఇప్పటికే ప్రతిపాదించి, ప్రభుత్వానికీ తెలియజేశామన్నారు. రైతుల నుండి ఏ విధమైన అభ్యంతరాలూ రాని పక్షంలో జూన్ పదో తేదీ తర్వాతే నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఏజన్సీ మండలాల్లో నీరు-చెట్టు పథకానికి సంబంధించి గత మూడేళ్ళుగా బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు వీలు కావడం లేదని ఆ ప్రాంతానికి చెందిన జడ్పీటీసీలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. రుణాల మంజూరు బ్యాంకులు ఇబ్బందులకు గురి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని అమలాపురం ఎంపీ పీ రవీంద్రబాబు స్పష్టం చేశారు. రుణాల మంజూరులో బాంకర్ల పనితీరు సక్రమంగా లేదని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ కూనవరంలో ముంపు మండలాలను పరిశీలించేందుకు తాను వెళ్ళగా అటవీ శాఖ రేంజర్ తనకు అటవీ శాఖ అతిథి గృహాన్నిచ్చేందుకు నిరాకరించారన్నారు. సుమారు గంట పాటు తమకు అతిథి గృహం ఇవ్వకుండా వివిధ రకాల ప్రశ్నలతో విసిగించారని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.