తూర్పుగోదావరి

దొంగలకు అధికారులు సహకరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 24: అధికారుల సహకారంతోనే జిల్లాలో ఇసుక అక్రమాలు జరుగుతున్నట్టు శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పారు. అధికారుల సహకారం లేకుండా ఇసుక దొంగతనాలు జరగవన్నారు. ఎక్కడికక్కడే లంచాలతో వ్యవస్థ నడుస్తోందన్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం రెడ్డి విలేఖర్లతో మాట్లాడారు. ప్రభుత్వ చేతకాని తనం, వైఫల్యం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నట్టు భావించాలా? అని విలేఖర్లు ప్రశ్నించగా రెడ్డి తడబాటుకు గురయ్యారు. జిల్లాలో ఊబలంక, జొన్నాడ ర్యాంపుల్లో ఇసుక రవాణా సక్రమంగా జరుగుతోందని, చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వం వహిస్తోన్న గోపాలపురం రీచ్‌లోనే అక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎమ్మెల్యేపై వాటర్ బాటిళ్ళు విసిరి, అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు కదా? అన్న విలేఖర్ల ప్రశ్నకు మండలి డిప్యూటీ ఛైర్మన్ ఐన తనపై వారు పేపర్లు విసరవచ్చా? అని తిరిగి ప్రశ్నించారు.

జడ్పీ ఆధ్వర్యంలో 5కె వాక్
కాకినాడ, మే 24: జిల్లా ప్రజా పరిషత్ నూరేళ్ళ వేడుకలను పురస్కరించుకుని గురువారం నగరంలో 5కె వాక్‌ను నిర్వహించారు. ఈ వాక్‌ను నగర మేయర్ సుంకర పావని జెండా ఊపి ప్రారంభించారు. భానుగుడి సెంటర్ నుండి టూటౌన్, బాలాజీచెరువు మీదుగా జడ్పికి చేరుకుంది. ఈ వాక్‌లో జడ్పి ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, జడ్పిటిసిలు గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ, మల్ల వెంకటరత్నం, వివిధ విభాగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు, పాల్గొన్న వారికి మొక్కలను నవీన్ అందించారు.