తూర్పుగోదావరి

భారీ వర్షంతో ట్రాఫిక్‌కు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, మే 26: మారేడుమిల్లిలో శనివారం ఈదురుగాలులు, భారీవర్షానికి పలుచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బస్సులతో పాటు పలు వాహనాలు రహదారికి ఇరువైపులా నిలిచిపోయాయి. శనివారం మారేడుమిల్లి గురుకుల జూనియర్ కళశాలకు ఎదుట ఉన్న నేరేడు చెట్టు రహదారికి అడ్డంగా కూలిపోయింది. దీనికి తోడు భారీవర్షం వల్ల ప్రయాణీకులు తమ వాహనాల్లోనే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు తక్షణ సహయక చర్యలు చేపట్టి రహదారికి అడ్డంగా కూలిన చెట్టును తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. ఈదురుగాలులకు పలు చోట్ల విద్యుత్తు తీగలపై చెట్లుకూలడంతో రెండు విద్యుత్తు స్థంబాలు నెలకూలగా మరికొన్ని స్థంబాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో మారేడుమిల్లితో పాటు లోతట్టు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీరు దారుణం
మామిడికుదురు, మే 26: జిల్లా పరిషత్ సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యవహరించిన తీరు దారుణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఇరిగేషన్ కార్పోరేషన్ ఛైర్మన్ నామన రాంబాబు అన్నారు. శనివారం మగతపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో నామన మాట్లాడారు. అత్యున్నత స్థాయిలో ఉన్న శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం పట్ల ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, సుబ్రహ్మణ్యంపై కాగితాలు విసరడం, దూషించడం తగదన్నారు. జిల్లాలో 50మంది టీడీపీ శ్రేణులకు సంబంధించి రూ.27.8 లక్షలు పార్టీ ఆర్థిక సహాయంగా మంజూరు చేసిందని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పార్టీ కార్యకర్తలకు ఈ సహాయం ఎంతగానో మేలు చేకూరుస్తుందని నామన అన్నారు. సమావేశంలో మామిడికుదురు, అంబాజీపేట జడ్పీటీసీ సభ్యులు విత్తనాల మాణిక్యాలరావు, బొంతు గంగాధర్, టీడీపీ నాయకులు సూదా బాబ్జీ, సరెళ్ల సత్యనారాయణ, జాలెం సుబ్బారావు, ముక్కర్రం హుస్సేన్, బొలిశెట్టి మాధవ, ఈలి శ్రీనివాస్, మెండా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.