తూర్పుగోదావరి

ఉద్దానం కిడ్నీ బాధితులకు జనసేన బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 26: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద శనివారం ఆ పార్టీ జిల్లా నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి రావడంతో దీక్ష విజయవంతమైంది. జిల్లా నేత, జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీ్ధర్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉద్దానం సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణం రాష్ట్రంలో వైద్యరోగ్య శాఖ మంత్రిని నియమించాలన్నారు. కీలకమైన వైద్యారోగ్య శాఖకు ప్రత్యేకించి మంత్రిని నియమించకపోవడం విచారకరమని వాపోయారు. బాధితులకు మద్దతుగా శ్రీకాకుళంలో తమ అధినేత పవన్‌కళ్యాణ్ దీక్షలో కూర్చున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబం దివగంత ఎర్రన్నాయుడు పేరు చెప్పుకుని బతుకుతున్నారని విమర్శించారు. గౌతు శివాజీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం గురించి నేడు ఉద్యమాన్ని తీసుకుని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న బాధితుల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రజలు అనేక జబ్బులతో బాధ పడుతున్నారని, ఆయా జిల్లాల్లో అనేక ఏళ్ళుగా పదవులు అనుభవివిస్తున్న నేతలకు జబ్బుల్లేవని వ్యాఖ్యానించారు. దీక్షలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, నల్లం శ్రీనివాస్, కుంపట్ల గోపాల్, తుమ్మల బాబు, కడలి ఈశ్వరి, లక్ష్మీసౌజన్య, గంటా స్వరూప, బీర కృష్ణప్రియ, తుమ్మలపల్లి చందు, డాక్టర్ బొండా సూర్యారావు, నూకల నారాయణరావు, గింజాల శ్రీనివాస్, బండారు శ్రీనివాసరావు, జ్యోతుల వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.