తూర్పుగోదావరి

కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 26: ప్రధాని మోదీ రాక్షస పాలన అంతమొందించాలని నినదిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చారిత్రాత్మక రాజమహేంద్రవరం కోటగుమ్మం సాక్షిగా రణ శంఖారావం పూరించారు. రాష్టవ్య్రాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని పీసీసీ అధినేత రఘువీరారెడ్డి శనివారం స్థానిక కోటగుమ్మం నుంచి ఆరంభించారు. నాలుగేళ్ళ మోదీ పాలనలో ఘోరంగా మోసపోయామని ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఈ రణ శంఖారావంలో పాల్గొన్నాయి. స్థానిక కోటగుమ్మం జంక్షన్ వద్ద రఘువీరారెడ్డి పాదయాత్ర మొదలెట్టారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జేడీ శీలం, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, పీసీసీ కార్యదర్శులు జంగా గౌతమ్, ఎస్‌ఎన్ రాజా, డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు తదితరులున్నారు. కోటగుమ్మం సెంటర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా పాదయాత్ర స్థానిక పాల్‌చౌక్-కోటిపల్లి బస్టాండ్ జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ మానవహారం చేసి నిరసన నిర్వహించారు. అనంతరం ప్రజలనుద్దేశించి రఘువీరారెడ్డి మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన పాదయాత్రలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్, రాయుడు రాజవల్లి, రాయుడు సతీష్, మాజీ మంత్రి జేడీ శీలం, పీసీసీ కార్యదర్శులు ఎస్‌ఎన్ రాజా, జంగా గౌతమ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు బాలేపల్లి మురళీధర్, ముషిణి రామకృష్ణ, మాజీ ఎంపీ ఏజెవీబీ మహేశ్వరరావు, నాయకులు కామన ప్రభాకరరావు, దాసి వెంకటరావు, ఎస్‌ఎ హర్షద్, షేక్ అసదుల్లా అహ్మద్, ముళ్ల మాధవ్, బెజవాడ రంగారావు, అంకం గోపీ, ఆకుల భాగ్యలక్ష్మి, చీకట్ల అబ్బాయి, సుభాషిణి, గుల్లా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రఘువీరారెడ్డికి ఎస్వీ మార్కెట్ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.