తూర్పుగోదావరి

ఉక్కబోత... విద్యుత్ కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: రాజమహేంద్రవరం నగర ప్రజలు ఆదివారం ఉక్కపోత, విద్యుత్‌కోతలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇపిడిసిఎల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానికితోడు ఉదయం నుంచే ఎండ మండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎండకు తోడు తీవ్రమైన ఉక్కపోత వల్ల అల్లాడిపోయారు. ఆదివారం గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 29.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండవేడికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో 11 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం 6వరకు జనాలు రోడ్లపైకి వచ్చేందుకు సాహసించలేకపోయారు. కాగా, ఎండలకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోవడంతో విశాఖపట్నం సమీపంలోని కలపాక వద్ద గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలింది. సుమారు 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇపిడిసిఎల్ పరిధిలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్‌స్టేషన్లు స్తంభించిపోయాయి. ఉదయం 10గంటల సమయంలో రాజమహేంద్రవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. ఎండల నుంచి తట్టుకునేందుకు ఎసిల వినియోగం పెరిగిపోవడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. సరఫరాకు, ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఏర్పడటంతో అప్రకటిత విద్యుత్ కోతలు అనివార్యం కానున్నాయి. ఇప్పటికే రూరల్ ప్రాంతాల్లో విద్యుత్‌కోతలను అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో నగరాల్లో కూడా ఈపరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో రానున్న మండువేసవిలో ప్రజలు ఉక్కపోత, విద్యుత్‌కోతలతో అల్లాడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.