తూర్పుగోదావరి

రేపటి నుండి రెవెన్యూ గ్రామసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 18: ఈ నెల 20 నుండి జూలై 5వ తేదీ వరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం తెలియజేశారు. గ్రామ సభల నిర్వహణకు 21 మంది ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించినట్టు చెప్పారు. వివిధ సమస్యల పరిష్కారానికి గ్రామసభల్లో అధికారులు కృషి చేస్తారన్నారు. 22ఎ పిటిషన్లు, మ్యూటేషన్ దరఖాస్తులు, చుక్కల భూముల దరఖాస్తులు, పట్టాలు, ఇళ్ల స్థలాలు, పట్టణ భూముల క్రమబద్ధీకరణ, సంయుక్త ఫార్మింగ్ భూములకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ సభలకు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, సూపర్‌వైజింగ్ అధికారులు పాల్గొంటారన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ అడ్డతీగల, రాజవొమ్మంగి, ఏజన్సీ గంగవరం మండలాలకు సూపర్‌వైజింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సీఎస్ సాయికాంత్‌వర్మ రాజమహేంద్రవరం అర్బన్, సీతానగరం, ఆలమూరు మండలాలకు, రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, వై రామవరం మండలంలోని గ్రామాలకు పర్యవేక్షణ వహిస్తారన్నారు. ఎటపాక సబ్ కలెక్టర్ ఎ అభిషిక్త్ కిశోర్ ఎటపాక, కూనవరం, చింతూరు, వీఆర్ పురం, రాజమహేంద్రవరం గెయిల్ ఎస్‌డీసీ సుగుణకుమారి తుని, తొండంగి, కోటనందూరు, రాజమహేంద్రవర భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్ ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, డ్వామా పీడీ రాజకుమారి పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి కాకినాడ రూరల్, కరప, పెద్దాపురం ఆర్డీవో రాయుడు పెద్దాపురం, కిర్లంపూడి, ఏలేశ్వరం, రాజమహేంద్రవరం గోదావరి గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ ఎస్‌జీసీ సత్యనారాయణ అనపర్తి, బిక్కవోలు, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు కాకినాడ అర్బన్, సామర్లకోట, తాళ్ళరేవు, పెదపూడి, రామచంద్రపురం ఆర్డీవో రాజశేఖర్ రామచంద్రపురం, పామర్రు, కాజులూరు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డేవిడ్‌రాజు ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన మండలాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. అమలాపురం ఆర్డీవో బీవీ రమణ అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, జిల్లా పరిషత్ సిఈవో ఆర్ గోవిందరావు కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, కూనవరం భూసేకరణ ఎస్‌డీసీ మురళీమోహన్ మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలు, జిల్లా మైనార్టీ అధికారి సునీత కోరుకొండ, గోకవరం, రాజానగరం, కాకినాడ ఎస్‌ఇజడ్ యూనిట్-2 ఎస్‌డీ సీ కడియం, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ ఎస్ జీసీ భీష్మానందం జగ్గంపేట, రంగంపేట, గండేపల్లి మండలాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారని కలెక్టర్ వివరించారు.

273 మంది పోలీసులకు బదిలీలు
కాకినాడ సిటీ, జూన్ 18: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఐదు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న 273 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించారు. స్థానిక పోలీస్ కనె్వన్షన్ హాలులో సోమవారం జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సిబ్బంది కోరుకున్న పోలీస్ స్టేషన్‌లకు బదిలీలు చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే సమాచారాన్ని నేరుగా సిబ్బంది తెలుసుకునే విధంగా ఎల్‌సిడి స్క్రీన్‌లపై ప్రదర్శిస్తూ కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ ఎఆర్ దామోదర్, ఒఎస్‌డి వై రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.