తూర్పుగోదావరి

రైతుఘోష రాష్ట్రానికి మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 18: రైతు పండించిన పంటకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర లభించినపుడే ప్రతి రైతు వ్యవసాయాన్ని పండగ వాతావరణంలో చేస్తారని రాష్ట్ర మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. సోమవారం అల్లవరం మండలం బెండమూర్లంకలో నిర్వహించిన రాష్ట్ర రైతు సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సంతోషంగా ఉన్నపుడే సమాజం, రాష్ట్ర, దేశం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయన్నారు. రైతు ఘోషను పట్టించుకోకపోతే ప్రభుత్వాల పతనం తప్పదని దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేసే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని, పారిశ్రామిక రంగానికి కల్పిస్తున్న రాయితీలు వ్యవసాయ రంగానికి కల్పించినపుడే రైతన్న వ్యవసాయంపై ఆసక్తి చూపుతాడని దినేష్‌రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించకపోతే మరోసారి రైతు పంట విరామం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తాను ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రైతులను కదిలించినపుడు ఏ ఒక్క రైతు వ్యవసాయం పట్ల ఆసక్తిని చూపుతూ మాట్లాడలేదని, రైతులంతా వ్యవసాయం పట్ల నిరాశ నిస్పృహలతోనే ఉన్నారన్నారు. ఈ విధానం దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని, రైతు తన నిరసనను ప్రకటిస్తే దేశంలో అల్లకల్లోల పరిస్ధితులు ఏర్పడతాయని, అటువంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు. 2013 భూ సేకరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెపుతారని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆల్డా ఛైర్మన్ యాళ్ల దొరబాబు, రైతు నాయకులు పాల్గొన్నారు.

కోటిపల్లి రైల్వే పనులు పూర్తికి సంపూర్ణ సహకారం
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్
రాజోలు, జూన్ 18: కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను పనులు త్వరితగతిన పూర్తయ్యేలా తనవంతు సహకారం అందిస్తానని అఖిలభారత బీజేపీ ప్రధాన కార్యదర్శి వారణాశి రామ్‌మాధవ్ అన్నారు. సోమవారం తాటిపాకలో ఉన్న కొచ్చర్లకోట రామరాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్‌కు సుమారు రూ. 1000 కోట్లు కేటాయించిందన్నారు. 2015లో కోనసీమ జేఏసీ కార్యవర్గం ఢిల్లీ వచ్చి రైల్వే నిమిత్తం తనని కలిశారని, దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళి రైల్వే లైన్‌కు నిధులు కేటాయించామన్నారు. కోనసీమ జేఏసీ రైల్వే పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ రైల్వేలైన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించవచ్చని రామ్‌మాధవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలు కోడ్ వచ్చేలోపు ఈ పనులను పూర్తిచేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొచ్చర్లకోట ప్రభాకర్ సుందరరావు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, వేటుకూరి సూర్యనారాయణరాజు, నల్లా వపన్‌కుమార్, కొల్లి సూర్యారావు, ఎన్ హుసేన్, ఎస్ సూర్యప్రకాష్‌రావు, కంకిపాటి సుబ్బారావు, సి గోపాలకృష్ణ, బత్తుల లక్ష్మీకుమారి, మెండా ఆదినారాయణ, అడబాల జానకిరామ్, బండారు రామ్మోహన్‌రావు, కోనసీమ రైల్వే జేఏసీ నాయకులు పాల్గొన్నారు.