తూర్పుగోదావరి

ఫ్యామిలీ మెంబర్ కావాలంటే...పైసలివ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, జూన్ 18: ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌గా సర్ట్ఫికెట్ అడిగితే రూ.2 వేలు లంచం డిమాండ్ చేయడమే కాకుండా, 1100 నెంబరుకు ఫిర్యాదు చేసినందుకు దరఖాస్తునే తిరస్కరించారు ఇక్కడ రెవిన్యూ అధికారులు. చివరకు కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వీఆర్వోను సస్పెండ్ చేయడంతోపాటు, ఈ వ్యవహారం వెనుక ఉన్న అధికారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కాకినాడ ఆర్డీవోను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి తాతయ్య భార్య నూకరత్నం ఇటీవల మృతి చెందింది. అయితే నూకరత్నం బ్యాంకు ఖాతాలో నగదు ఉంది. నగదు తీసుకోవడానికి బ్యాంకు అధికారులు ఫ్యామిలీ మెంబర్స్ సర్ట్ఫికెట్ అడగడంతో తాతయ్య సర్ట్ఫికెట్ కోసం మీ-సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై మే 26న వీఆర్వో, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ విచారణ చేశారు. ఆ సమయంలో వీఆర్వో నూకరాజు రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే రూ.1000 మాత్రమే ఇచ్చుకొంటానని చెప్పడంతో ఒప్పుకోని వీఆర్వో అక్కడ నుంచి వచ్చేశాడు. ఆ తరువాత రెండు రోజుల్లోనే తాతయ్య దరఖాస్తును తిరస్కరించారు. ఇలా జరుగుతుండగా ప్రభుత్వ పనితీరుపై స్పందన ఏలా ఉందంటూ వస్తున్న ఫోన్‌కాల్ అనుకోకుండా బాధితుడు కొమ్మిరెడ్డి తాతయ్యకు వచ్చింది. తాను ఫ్యామిలీ మెంబర్ సర్ట్ఫికెట్ తీసుకోవడం కోసం పడుతున్న ఇబ్బంది వివరించాడు. దాంతో వారు వివరాలు 1100కు కాల్ చేసి చెప్పాలని తెలిపారు. దీంతో 1100 నెంబర్‌కు ఫోన్ చేసిన తాతయ్య జరిగిన విషయాన్ని వారికి వివరించాడు. ఇది జరుగుతుండగానే సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌కు వెళ్లి విషయాన్ని తాతయ్య కుటుంబసభ్యులు కలెక్టర్‌కు చెప్పడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. వెంటనే సంబంధిత వీఆర్వో నూకరాజును సస్పెండ్ చేశారు. కావాలనే దరఖాస్తు తిరస్కరించిన వ్యవహారంపై విచారణ చేయాలని ఆర్డీవో రఘుబాబును ఆదేశించారు.