తూర్పుగోదావరి

పోలవరం నిర్వాసితులకు 17 పునరావాస కాలనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 19: పోలవరం నిర్వాసితులకు 17 పునరావాస కాలనీలు నిర్మిస్తున్నామని, వీటిలో 15 కాలనీల నిర్మాణానికి టెంటర్లు ఖరారు చేసి, ఏజన్సీలను ఎంపిక చేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ నుండి మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పోలవరం పునరావాస గ్రామాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ గృహ నిర్మాణ, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఏపీఈఎడబ్ల్యుఐడీసీ శాఖలకు ఈ పనులను అప్పగించామన్నారు. కాలనీల్లో గృహ నిర్మాణం, వౌలిక సౌకర్యాలు, సామాజిక భవనాలు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని కాలనీలకు ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి, మొక్కల నిర్వహణ బాధ్యతలను సంబంధిత ఏజన్సీలకు అప్పగించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 20 రోజుల్లోగా కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. గిరిజనేతరులైన నిర్వాసితులకు గోకవరం మండలం కృష్ణునిపాలెంలో కాలనీ నిర్మించనున్నామని, ఈ పనులను గృహ నిర్మాణ శాఖకు అప్పగిస్తున్నట్టు తెలియజేశారు. వనం-మనం కార్యక్రమం ద్వారా ఈ కాలనీల్లోను, చింతూరు ఐటీడిఏ పరిధిలోని అన్ని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, ఈ పనులకు నిధుల కొరత లేదని, పూర్తిచేసిన పనులన్నిటికీ సకాలంలో నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ మల్లిఖార్జున, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికార్లు నిషాంత్‌కుమార్, అభిషిక్త్‌కిశోర్, ప్రత్యేక కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.