తూర్పుగోదావరి

రక్తదానంలో జిల్లా పోలీసులు ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూన్ 19: రక్తదానం చేయడంలో జిల్లా పోలీసులు ఇతర జల్లాల పోలీసుల కంటే ప్రథమ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసులు రక్తదానం చేసి ఒకే రోజున 580 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు. దీనికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సంస్థ అధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ నరసింహన్ జిల్లా పోలీసులకు ప్రథమ స్థానం ఇస్తూ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డును జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఛైర్మన్ వైడి రామారావు మంగళవారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లా ప్రథమ బహుమతిని సాధించడం గర్వంగా ఉందన్నారు. రక్తదానం చేయడం వలన ఆపదలో ఉండే గర్భిణులకు, ప్రమాదంలో గాయాలపాలైన బాధితులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. భవిష్యత్‌లో సైతం జిల్లా పోలీసులు రెడ్‌క్రాస్ సంస్థకు అవసరమైన రక్తాన్ని అందజేస్తారని ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.

కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి
*28న ఏరువాక *కలెక్టర్ మిశ్రా
కాకినాడ, జూన్ 19: జిల్లాలోని కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇప్పించడానికి వ్యవసాయ, రెవెన్యూ శాఖలు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రాథమిక రంగాల్లోని వ్యవసాయ అనుబంధ శాఖల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో 2.50 లక్షల మంది కౌలు రైతులున్నారని, వీరందరికీ పంట రుణాలందించే చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కౌలు రైతులకు 1.14 లక్షల మందికి ఎల్‌ఇసి జారీ చేశామన్నారు. ఈ పత్రాలను కౌలు రైతులందరికీ అందజేసి వారికి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 27 వేల మంది కౌలు రైతులకు 81 కోట్ల మేర రుణాలందించారని, అదే విధంగా సిఓసి 67 వేల మందికి ఇచ్చామన్నారు. ఖరీఫ్ పంట రుణాల ప్రగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ 92 వేల 216 మంది రైతులకు 1542 కోట్ల రుణంగా అందజేశారని అదే విధంగా 16 809 రైతులకు టరమ్స్ లోన్‌గా 432 కోట్లను అందజేశారన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. సర్వశిక్షాభియాన్ ద్వారా పాఠశాలల్లోని వౌలిక సదుపాయాల పనులన్నీ వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ఎ మల్లికార్జున, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, డిఆర్‌ఓ ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.