తూర్పుగోదావరి

ఆక్వాజోన్‌పై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జూన్ 19: మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వాజోన్‌పై కె గంగవరంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సును అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రజలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కె గంగవరం మండలంలోని గ్రామాలను తాళ్లపూడి మత్స్యశాఖ డివిజన్‌లోకి తరలించిన నేపథ్యంలో మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం చేపట్టడానికి ఆక్వా కల్చర్ అథారిటీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం తవ్విన చెరువులను క్రమబద్ధీకరించడం, కొత్తగా చెరువులు తవ్వుకునేందుకు అనుమతి అందించేందుకు గ్రామాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణను ప్రజాప్రతినిధులు, అధికార్లతో గ్రామసభలు ఏర్పాటుచేయమని ఆదేశాల మేరకు మంగళవారం కె గంగవరం మండలంలోని కె గంగవరం, కోట గ్రామాల్లో సదస్సులు జరిగాయి. ఈ సందర్భంగా అఖిలభారత రైతుకూలీ సంఘం నేతృత్వంలో ఆక్వాజోన్ ఏర్పాటు కుదరదని నిరసన వ్యక్తం చేశారు. కె గంగవరం గ్రామంలోని 80ఎకరాల రొయ్యల చెరువులను మూసివేయాలని, కొత్తగా రొయ్యల చెరువులు తవ్వేందుకు అనుమతులు ఇవ్వరాదని, ఆక్వాజోన్‌ను రద్దుచేయాలని సదస్సులో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ ఈ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని సభలో హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి కోటిపల్లి-కాకినాడ రోడ్డులోని ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మెయిన్‌రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. అదేసమయంలో రామచంద్రపురం ఆర్డీవో ఎన్ రాజశేఖర్ ప్రజాసంఘాల నాయకుల వద్దకు వచ్చి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రామచంద్రపురం డివిజన్ కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ రొయ్యల చెరువుల కారణంగా ప్రజలకు ఉపాధి, తాగునీరు, సాగునీరు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి ఆక్వాహబ్‌గా మార్చాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. కె గంగవరంలో 80 ఎకరాలకు పైగా ఉన్న రొయ్యల చెరువులను మూసివేయాలని దఫదఫాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ మూసివేస్తామని అధికారులు హామీలిచ్చినా అమలుకావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రొయ్యల చెరువులను పూర్తిగా తొలగించాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలన్నారు. అధికారులు స్పందించకుంటే ప్రజలే పోరాటంలో భాగంగా రొయ్యల చెరువులను లేకుండా చేస్తారని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండ్రు గనిరాజు, నాయకులు రావి చినబాబు, గ్రామస్థులు తుమ్మలపల్లి సత్యనారాయణ, పోలిశెట్టి శ్రీనివాస్, ఎన్ కాశీ, సుందరపల్లి అప్పారావు, రావి వెంకట్రావు, పీతల రాజు, కానూరి శివరావు, కూర్మా రాజు, పాము దుర్గ, వి బేబీ, పి సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

తాపేశ్వరంలో సినీ కథానాయక ఆమని
మండపేట, జూన్ 19: ప్రముఖ సినీ కథానాయిక ఆమని మండలంలోని తాపేశ్వరం గ్రామంలో గల సురుచి ఫుడ్స్ స్టాల్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాజా తయారీ విధానాన్ని ఆమె నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సురుచికి లభించిన పలు అవార్డులను ఆమె ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆమని స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై డైరెక్టర్ నక్కిన త్రినాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ‘హలో గురు ప్రేమకోసం..’ చలన చిత్రంలో ప్రకాష్‌రాజ్ శ్రీమతిగా నటిస్తున్నట్టు చెప్పారు. గత నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చలన చిత్రాన్ని నిర్మిస్తున్నారన్నారు. మంగళవారం ద్రాక్షారామంలో జరిగిన షూటింగ్ పూర్తిచేసుకుని రాజమహేంద్రవరం వెళుతూ మార్గమధ్యలో ఉన్న తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌కు వచ్చినట్టు చెప్పారు. సురుచి పీఆర్వో వర్మ ఆమెకు అతి పెద్ద కాజాను కానుకగా అందజేశారు. కార్యక్రమంలో సురుచి జీఎం శంకర్, కుక్ మల్లి, తదితరులు పాల్గొన్నారు.

ఏకాగ్రతే విజయానికి పునాది
- సివిల్స్ విజేత ప్రవీణ్ చంద్

అమలాపురం, జూన్ 19: విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేస్తే ఎంతటి విజయాన్నయినా సాధించవచ్చని సివిల్స్‌లో 512వ ర్యాంకరు, అమలాపురంనకు చెందిన గోకరకొండ ప్రవీణ్ చంద్ అన్నారు. అమలాపురం పరిసర ప్రాంతాలకు చెందిన గోకరకొండ కుటుంబీకుల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గ్రాండ్ పార్కు హోటల్‌లో ప్రవీణ్ చంద్ సన్మాన సభ అమలాపురం కళావెంకటరావు పీఏసీఎస్ అధ్యక్షుడు జీ విజయరామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ పాఠశాల దశలోనే తాను సివిల్స్‌లో విజయం సాధించాలనే పట్టదలను ఏర్పరుచుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ర్యాంకు సాధించానన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి దశలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ ఆ కష్టాలే తనను లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించాయన్నారు. కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదన్న అంశాన్ని నేటి విద్యార్థులు గుర్తిస్తే ఎవరైనా దేనినైనా సాధించవచ్చని ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ సమాజహితంగా పనిచేస్తే అభివృద్ధి సులభతరం అవుతుందని ప్రవీణ్ అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి అత్యున్నత స్థాయి సివిల్స్ సర్వీసు పరీక్షలో విజయం సాధించిన ప్రవీణ్ చంద్‌ను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వక్తలు సూచించారు. అంతకు ముందు ప్రవీణ్ చంద్‌ను గోకరకొండ కుటుంబీకులు దుశ్శాలువా, పూల మాలలుతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి సర్పంచ్ సుగుణ, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు గోకరకొండ హరిబాబు, సంస్కార భారతి అధ్యక్షుడు గోకరకొండ కృష్ణగోవిందం, తాతాజీ, బాల, చంద్రరావు, వాసు, వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కిమ్స్ ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ వైద్యసేవలు

అమలాపురం, జూన్ 19: కోనసీమలో తొలిసారిగా గుండెకు సంబంధించి వైద్యసేవలు అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభమయ్యాయి. ఈ వైద్యసేవలను మంగళవారం కిమ్స్ వైద్య కళాశాల ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు ప్రారంభించారు. గుండె వ్యాదులకు సంబంధించి నిర్వహించే యాంజియోగ్రామ్‌తో పాటు యాంజియోప్లాస్టీ (స్టెంట్లు అమర్చుట), కార్డీవోథోరాస్కీ సర్జరీలు (బైపాస్, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు) ఎన్‌టీఆర్ వైద్యసేవల ద్వారా ఉచితంగా చేయనున్నట్టు కిమ్స్ సుపర్ స్పెషాలిటి సీఈవో డాక్టర్ బాలాజీ తెలిపారు. యాంజియోగ్రామ్ వైద్యసేవలను గురించి కిమ్స్ కార్డియాలజిస్టు డాక్టర్ బద్రీనారాయణ వివరించారు. కోనసీమ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని కిమ్స్ ఛైర్మన్ చైతన్యరాజు, ఎండీ కే రవికిరణ్‌వర్మ కోరారు. తొలిసారిగా యాంజియోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని, కిమ్స్ యాజమాన్యాన్ని, కళాశాల డీన్ ఏఎస్ కామేశ్వరరావు, సూపరిటెండెంట్ ఏ సుబ్బారావు, వైద్యులు అభినందించారు.